DEVELOPMENT OF A NATION DEPENDS ON ITS HEALTH INDEX-UNION MINISTER _ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి దేశానికే ఆదర్శం-  కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి

LAUDS TTD PEDIATRIC AND ORTHO HOSPITALS

 

TTD CHILDREN’S HOSPITAL A ROLE MODEL TO THE COUNTRY

 

TIRUPATI, 11 APRIL 2023: Health Care and Education are the two crucial components in the growth of a country and the Health Index decides the development of a nation, said Sri Hardeep Singh Puri, the Honourable Minister for Housing and Urban Affairs & Petroleum and Natural Gas, Government of India.

 

The Union Minister along with his family and entourage, after offering prayers in the temple of Sri Venkateswara Swamy at Tirumala on Tuesday, visited TTD-run Sri Padmavathi Children’s Heart Centre and BIRRD Ortho Hospitals.

 

TTD EO Sri AV Dharma Reddy and Director of SPCHC Dr Srinath Reddy led him to the various wards where the infants and children are being treated for their heart ailments. The Minister visited Cathlab, ICU etc.and interacted with the patient’s parents. 

 

He expressed immense happiness over the mode of service being offered by TTD to the infants and children by performing heart surgeries to the needy free of cost. Later he also visited the BIRRD ortho hospital where the knee joint replacements and ortho related ailments are being carried out free of cost to the needy.

 

Speaking to media persons, he said, the services in these two-TTD run hospitals are laudable and especially the Pediatric Cardiac Centre is impeccable. “I had just seen a few days old, months old infants who were successfully treated by the team of dedicated doctors and para medical staffs in the hospital giving a new lease of life to the infants. I also compliment TTD for having started such a wonderful hospital and the initiative of the State Government also”, he added.

 

He said, I was informed that even during the hard times of Covid, the TTD-run BIRRD hospital has served as a Covid Care Centre and treated many which deserves a pat. Today, under the able leadership of the Honourable Prime Minister Sri Narendra Modiji, we rebuilt Health Care Centre in the country from scratch. India stood as a role model to the entire world during the Covid Pandemic and today over 224 crore vaccinations are being manufactured by us”, he asserted. 

 

“I once again whole-heartedly congratulate the TTD and the entire team of doctors for their services in the field of Medical and Health and the Pediatric Cardiac Centre is sure to become a role model hospital in the entire country”, he reiterated.

 

JEO for Health and Education Smt Sada Bhargavi, EE Sri Krishna Reddy, Dr Ganapathi from SPCHC and BIRRD Doctors including Dr Ramurty, Dr Pradeep, Dr Venugopal and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి దేశానికే ఆదర్శం

– టీటీడీ ఆసుపత్రుల్లో సేవలు అభినందనీయం

– కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి

తిరుపతి, 2023 ఏప్రిల్ 11: ఒక దేశ అభివృద్ధిలో ప్రజల ఆరోగ్య సంరక్షణ మరియు విద్య రెండు కీలకమైనవని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు మరియు పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి అన్నారు.

మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానంతరం కేంద్ర మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం, బర్డ్ ఆసుపత్రులను సందర్శించారు.శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి దేశానికే ఆదర్శమని ఆయన కొనియాడారు.

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి వార్డుల్లో గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న చిన్నారులను, క్యాథ్‌ల్యాబ్, ఐసీయూ తదితర వార్డులను మంత్రి సందర్శించి, రోగుల తల్లిదండ్రులతో మాట్లాడారు.

నిరుపేదలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి బాలింతలకు, చిన్నారులకు టీటీడీ అందిస్తున్న సేవల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం బర్డ్ ఆసుపత్రిని సందర్శించి, నిరుపేదలకు ఉచితంగా మోకాలి కీళ్ల మార్పిడి మరియు ఇతర ఎముకల సంబంధిత వ్యాధులకు అందుతున్న చికిత్సలను పరిశీలించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి, బర్డ్ ఆసుపత్రులలో టీటీడీ అందిస్తున్న సేవలు అద్భుతమని, ముఖ్యంగా పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రిలో అంకితభావంతో సేవలు అందిస్తున్న వైద్యులు మరియు పారా మెడికల్ సిబ్బందిని అభినందించారు. అదేవిధంగా ఆస్పత్రి ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ చొరవను కూడా” మంత్రి ప్రశంసించారు.

కోవిడ్ కష్టకాలంలో కూడా, టీటీడీ ఆధ్వర్యంలో బర్డ్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్‌గా పని చేసినట్లు తెలిసిందన్నారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క సమర్థ నాయకత్వంలో భారతదేశం కోవిడ్ క్లిష్ట పరిస్థితులను అధిగమించి నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 224 కోట్ల వ్యాక్సినేషన్‌లను భారతదేశం ప్రస్తుతం తయారు చేస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ శ్రీ ధర్మా రెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, చిన్న పిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డా. శ్రీనాథ్ రెడ్డి,డాక్టర్ గణపతి, బర్డ్ వైద్యులు డాక్టర్ రామూర్తి, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ వేణుగోపాల్, ఈఈ శ్రీకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయడమైనది