PHULE IS MAN OF MASSES AND SOCIAL REFORMS-SPEAKERS _ బడుగుల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబా పూలే : తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు శ్రీ గౌరిశంకర్

TIRUPATI, 11 APRIL 2023: Mahatma Jyotirao Phule was an anti-caste and social reformer who stood for the upliftment of the downtrodden and women empowerment and revered as “Man of Masses” said the speakers.

 

On the occasion of 196th Birth Anniversary of Mahatma Jyotirao Phule, tributes were paid to the social reformer under the aegis of welfare department of TTD at Mahati Auditorium on Tuesday.

 

Stalwarts were invited to speak about the great humane. Speakers including  Telegana Sahitya Academy President Sri Gowri Shankar, Journalism professor from Kakinada Sri Srinivas, Bahujana Samakhya Sanghatan Chief Smt Preeta Harith elaborated on life, education, hardships, struggle and achievements of Sri Phule as social reformer. “His work extended to many fields, including the eradication of untouchability and the caste system and for his efforts in educating women and oppressed caste people. He is an icon of upliftment of women and downtrodden and stood as a role model to many in later years”, they asserted.

 

DyEOs Smt Snehalata, Sri Lokanatham, Sri Anandaraju, Smt Jagadeeshwari, SC, ST, BC leaders and employees of TTD were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బడుగుల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబా పూలే : తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు శ్రీ గౌరిశంకర్

మ‌హ‌తిలో ఘన‌గా 196వ జ‌యంతి ఉత్స‌వం

తిరుపతి, 2023 ఏప్రిల్‌ 11: బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే అని తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు శ్రీ గౌరిశంకర్ అభివర్ణించారు. మ‌హాత్మ జ్యోతిబా పూలే 196వ జ‌యంతి ఉత్స‌వం మంగళవారం తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో ఘ‌నంగా జ‌రిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ గౌరిశంకర్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన జ్యోతిబాఫూలే వర్ణ వ్యవస్థతో కునారిల్లుతున్న సమాజానికి సంస్కారం నేర్పారని కొనియాడారు. అణగారిన వర్గాల ఎదుగుదలకు విద్య సరైన ఆయుధమని భావించి పాఠశాలలు నెలకొల్పారని, స్త్రీ విద్యను ప్రోత్సహించారని, బాల్య వివాహలను వ్యతిరేకించి, వితంతు పునర్వివాహానికి నాంది పలికారని వివరించారు. అన్ని వర్గాల వారికి విద్య, ఉపాధి, రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారని వివరించారు.

కాకినాడకు చెందిన జర్నలిజం అధ్యాపకులు శ్రీ శ్రీనివాస్ మాట్లాడుతూ వెనకబాటు, కులతత్వం తదితర అనేక కారణాల వల్ల భారతీయ సమాజం ఇతర సమాజాల కంటే సంక్లిష్టమైందన్నారు. గౌతమ బుద్ధుడు మొట్టమొదట్టి సామజిక విప్లవకారుడని, తరువాతకాలంలో మహాత్మ జ్యోతిబాపూలే సామజిక విప్లవకారుడిగా అవతరించి బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, నిమ్న వర్గాలు అభివృద్ధి చెందాలంటే విద్య అవసరమని ఆనాడే గుర్తించి విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. స్వాతంత్య్రోద్యమానికి ముందు సాంఘిక సంస్కరణోద్యమం ద్వారా సమాజంలోని వివిధ రుగ్మతలను రూపుమాపేందుకు పూలే విశేష కృషి చేశారన్నారు.

బహుజన సమాఖ్య సంఘటన అధ్యక్షులు, విఆర్ఎస్ తీసుకున్న ఐఆర్‌ఎస్‌ అధికారిణి శ్రీమతి ప్రీత హరిత్ మాట్లాడుతూ, పూలే భారతదేశంలో మహోన్నత సంఘసంస్కర్త అని, పూలే దంపతులు సమాజం కోసం తమ జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ఫూలే తన భార్య సావిత్రి బాయికి విద్యాబుద్ధులు నేర్పించి మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా చరిత్రలో నిలిచిపోయేలా చేశారని చెప్పారు. ఆమె స్ఫూర్తితోనే ప్రస్తుతం మహిళలు ఉన్నత విద్యావంతులై అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. ఎందరో మహానుభావులు పూలేను తమ గురువుగా భావించారన్నారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీమతి స్నేహలత, శ్రీ లోకనాథం, శ్రీ ఆనంద రాజు, శ్రీమతి జగదీశ్వరి, అశ్విని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమ కుమారి, ఈఈ శ్రీ మనోహరం, ఎస్‌సి, ఎస్టీ, బీసీయూనియన్‌ నాయకులు, ఇతర అధికార ప్రముఖులు, టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.