TTD TO OBSERVE HANUMAN JANYANTHI UTSAVAMS FROM MAY 14-18 _ మే 14 నుండి 18వ తేదీ వరకు తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు

SAMPOORNA SUNDARAKANDA AKHANDA PARAYANAM ON MAY 16 AT DHARMAGIRI

60 VEDIC SCHOLARS TO PARTICIPATE IN THE PARAYANAM AND YAGAM

TIRUPATI, 11 APRIL 2023: The Hanuman Jayanthi festivities will be observed for five days in Tirumala from May 14 to May 18, said TTD EO Sri AV Dharma Reddy.

During a review meeting held at the chambers’ of TTD EO at the Administrative Building in Tirupati on Tuesday, he directed the officials concerned from various departments including Vedic institutions, SVBC, Engineering, Temple, Annaprasadam etc. to make necessary arrangements for the ensuing mega religious festival. 

The EO said, during these five days, renowned scholars will present discourses on the Birth, various characteristics of Sri Hanuman not only in a spiritual way but in a scientific angle also.

He directed the Dharmagiri Veda Vignana Peetham Principal Sri KSS Avadhani to make the arrangements for the pundits who will be rendering Akhanda Parayanam as well Yagam in the Peetham at Tirumala. He also asked them to involve the vedic scholars from SV Vedic University, National Sanskrit Varsity, SV Higher Vedic Studies apart from Dharmagiri. 

Later the EO instructed the Engineering officials to make necessary arrangements and GM Transport for arranging transportation to the invitees.

The Akhanda Parayanam will commence at 6am on May 16 and will conclude at around 11pm lasting for about 18hours without interruption. The total of 2872 slokas from Sundarakanda will be recited by a set of 11 Vedic Pundits who will be on rotation after the completion of a cycle of nearly 150 shlokas. 

The programme will be telecasted live on SVBC for the sake of global devotees. Every day, the devotional cultural programmes by Annamacharya, Dasa Sahitya, HDPP project artists will also entertain devotees in spiritual waves at Anjanadri Akasa Ganga and Nada Neerajanam platforms in Tirumala.

JEO for Health and Education Smt Sada Bhargavi, one of the Chief Priests of Tirumala temple Sri Venugopala Deekshitulu, CEO SVBC Sri Shanmukh Kumar, SE 2 Sri Jagadeeshwar Reddy, SVVU VC Sri Ranisadasiva Murthy, NSU VC Sri Krishnamurthy, GM Transport Sri Sesha Reddy, HDPP Secretary Sri Srinivasulu, All Dharmic Projects Programme Officer Sri Rajagopal, Annamacharya Project Director Sri Vibhishana Sharma, Publications Special Officer Sri Ramaraju and other officers were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 14 నుండి 18వ తేదీ వరకు తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు

– మే 16న ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం

– పారాయణం, యాగంలో పాల్గొనేందుకు 60 మంది వేద పండితులు

– ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి

తిరుపతి, 2023 ఏప్రిల్ 11: తిరుమలలో మే 14 నుండి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఎస్‌విబిసి, ఇంజినీరింగ్, శ్రీవారి ఆలయం, అన్నప్రసాదం, ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో మంగళవారం ఈవో ఛాంబర్‌లో అన్ని విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఆకాశ గంగ వద్ద ఐదు రోజుల పాటు శ్రీ హనుమంతుని జన్మ విశేషాలు, ఆధ్యాత్మిక పరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల వేద విజ్ఞాన పీఠంలో అఖండ పారాయణంతో పాటు, యాగం నిర్వహించేందుకు పండితులను ఆహ్వానించాలని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్‌ఎస్ అవధానిని ఆయన ఆదేశించారు. ధర్మగిరితో పాటు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత వర్సిటీ, ఎస్వీ ఉన్నత వేద అధ్యయనాల్లోని వేదపండితులు పాల్గొనాలని కోరారు.

అనంతరం ఆహ్వానితులకు రవాణా, వసతి, దర్శనం తదితర సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఈఓ ఆదేశించారు.

అఖండ పారాయణం మే 16న ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు దాదాపు 18 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. సుందరకాండలోని మొత్తం 2872 శ్లోకాలను వేద పండితుల సమూహంగా పటిస్తారని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఎస్విబిసిలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.

భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలోని అంజనాద్రి ఆకాశ గంగ, నాద నీరాజనం వేదికలపై ప్రతిరోజూ అన్నమాచార్య, దాససాహిత్య, హెచ్‌డిపిపి ప్రాజెక్టు కళాకారులచే ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జెఈవో శ్రీమతి సదా భార్గవి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఎస్‌విబిసి సి ఈ వో శ్రీ షణ్ముఖ్‌కుమార్, ఎస్‌ఇ 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఎస్‌వివియు విసి శ్రీ రాణిసదాశివమూర్తి, ఎన్‌ఎస్‌యు విసి శ్రీ కృష్ణమూర్తి, రవాణా శాఖ జిఎం శ్రీ శేషారెడ్డి, హెచ్‌డిపిపి సెక్రటరీ శ్రీ శ్రీనివాసులు, హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల్, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ విభీషణ శర్మ, పబ్లికేషన్స్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ రామరాజు, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.