DEVOTEES FLOOD “SHOBHA YATRA” FROM ALIPIRI TO SRINIVASA MANGAPURAM _ వైభవంగా శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర

TIRUPATI, MARCH 3:  Tens of thousands of devotees took part in the “Shobha Yatra” organised by TTD from Alipri to Srinivasa Mangapuram in connection with ongoing annual brahmtosavams of Lord Sri Kalayana Venkateswara Swamy at Srinivasa Mangapuram on Sunday.

As a part of the religious procession, the famous “Lakshmi Haaram” which is usually adorned to Lord Malayappa Swamy in Tirumala during Garuda Seva was taken on a grand procession in the streets of Tirupati including Hare Rama Hare Krishna road, Anna Rao circle, TTD Administrative Building, corporation, Gandhi Road, SV Dairy Farm to reach Srinivasa Mangapuram. This jewel will be adorned to the processional deity at the temple of Srinivasa Mangapuram on Gaurda Seva day which falls on May 5.

TTD EO Sri LV Subramanyam along with TTD JEO Sri P Venkatrami Reddy and CVSO Sri GVG Ashok Kumar flagged off the religious procession amidst tight security at Alipiri.
 
Speaking to media persons, TTD EO said, “It is great to see a huge turn out public to take part in this celestial procession. With these shobha yatras we want to popularise
other TTD-run temples, so that the pilgrims can come to know about the various rituals and festivals that are taking place in other TTD sub temples also. Last year we organised Shobha Yatra with one of the crowns of Lord Venkateswara and decorated it to Kalyana Venkateswara Swamy on Garuda Seva day. This year, we are performing shobha yatra with the most famous “Lakshmi Kasula Mala” which used to be a special
attraction in Tirumala during Garuda Sevas”, he added.

Meanwhile denizens who took part in this fete with great enthusiasm,offered coconuts, Haarati all through the procession with religious  fervour.

Special Grade Deputy EOs Welfare Sri Bhaskar Reddy, Services Sri Siva Reddy, HDPP OSD Sri Raghunath, Local temples Deputy EO Smt Reddemma, Tirumala temple Deputy EO Sri C Ramana, HDPP Deputy EO Sri Umapathi Reddy and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

వైభవంగా శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర

తిరుపతి, మార్చి 3, 2013: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని లక్ష్మీహారం శోభాయాత్ర ఆదివారం సాయంత్రం తిరుపతి నగరంలో వాడవాడలా భక్తుల గోవిందనామస్మరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్‌.వి.సుబ్రమణ్యం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శోభాయాత్ర ద్వారా తిరుమల శ్రీవారి ఆలయం నుండి శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి కానుకలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారికి అలంకరించిన ఆభరణాలను భక్తుల సమక్షంలో శోభాయాత్ర నిర్వహించడం ఆనందదాయకమన్నారు. భక్తులు ఈ ఆభరణాలను స్వామివారి ప్రతిరూపంగా భావించి హారతులిస్తున్నట్టు తెలిపారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని ఈవో అన్నారు.
ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నంగారి రమణ స్వామివారి లక్ష్మీహారాన్ని అలిపిరి పాదాలమండపం వద్దకు తీసుకొచ్చారు.

భక్తులందరూ దర్శించుకునేలా లక్ష్మీహారాన్ని అలంకృత వాహనంలో ఉంచి పూజలు చేశారు. తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం కొబ్బరికాయ కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు. హరేరామ హరేకృష్ణ రోడ్డు, కె.టి.రోడ్డు, తితిదే పరిపాలనా భవనం, కార్పొరేషన్‌ కార్యాలయం, నాలుగుకాళ్ల మండపం, గాంధీరోడ్డు, ఎస్వీ డైరీఫామ్‌, ఎస్వీ నగర్‌, చెర్లోపల్లి మీదుగా శోభాయాత్ర శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణల నడుమ తిరుపతి నగరంలో శోభాయాత్ర కోలాహలంగా జరిగింది. వేలాది సంఖ్యలో స్త్రీ, పురుషులు, పిల్లలు పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ శివారెడ్డి, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి శ్రీ రఘునాధ్‌, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.