Sri Kapileswara Swamy Temple Brahmotsavam Begins  _ ధ్వజారోహణంతో శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Temple priests of Sri Kapileswara Swamy performed “Dwajarohanam” (the traditional hoisting of the temple flag atop the flagpost) as mark of begining of Brahmotsavam in Sri Kapileswara Swamy Temple in Tirupati on sunday morning.
 
Amid beating of the traditional percussion instruments and the chanting of hymns from the scriptures, the chief priest hoisted the flag with an image of `Nandi’ atop the `dhwajasthambham on the auspious Kumbha Lagnam at 6.51am.’
 
Sri L.V.Subramanyam, Executive Officer,Exe Engineer Sri Jagadeeswara Reddy, DyEO Smt. Reddamma and others took part in the `homam’ that followed the event. 

ధ్వజారోహణంతో శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, మార్చి 3, 2013 : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5.30 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమం ప్రారంభమైంది. అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ ధ్వజస్తంభం వద్ద తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. 6.51 గంటలకు కుంభ లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి శాస్త్రోక్తంగా ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు.

 

అనంతరం 7.30 గంటల నుండి 9.30 గంటల వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారికి, శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీని అధిరోహించిన స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

 

సాయంత్రం 6.30 గంటల నుండి 8.30 గంటల వరకు హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో విహరించనున్నారు.

 

ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.