DHWAJAROHANAM PERFORMED TO NARAPURA VENKATESWARA SWAMY _ ధ్వజారోహణంతో ప్రారంభమైన జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Jammalamadugu, 23 May 2021: The annual brahmotavams of Sri Narapura Venkateswara Swamy temple located in Jammalamadugu of YSR Kadapa district commenced with Dhwajarohana Mahotsavam on Sunday.

As part of the fete, Vishvaksena Puja, Kalasa Sthapana, Vasudeva Punyahavachanam, Navakalasa Aradhana were performed to Dhwajasthambham in the temple followed by special abhishekam amidst chanting of Veda mantras. Later the sacred Dhwajapatham was hoisted on the temple mast in the auspicious hour.

The nine-day annual brahmotavams will be observed till June 1 in Ekantam within the temple premises in view of the Covid Pandemic.

TTD Board member Sri Chippagiri Varaprasad, TTD officials of the temple were also present.  

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వజారోహణంతో ప్రారంభమైన జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల

తిరుపతి, 2021 మే 23: వైఎస్ ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు.

సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 9.30 నుండి 10.30 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముందుగా ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఇందులో భాగంగా విష్వ‌క్సేన పూజ, కలశ‌ ప్ర‌తిష్ట‌, వాసుదేవ పుణ్యాహ‌వాచనం, నవక‌లశ‌ ఆరాధన, ధ్వ‌జ‌స్థంభానికి అభిషేకం నిర్వ‌హించారు.

ప్ర‌తి రోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్ దంప‌తులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.