NARAYANAVANAM FETE COMMENCES _ ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 23 May 2021: The annual mega fete at Sri Kalyana Venkateswara Swamy temple at Narayanavanam commenced on a grand note on Sunday.

In view of covid-19, all the Vahana Sevas and other rituals will be observed in Ekantam.

Dhwajarohanam was performed with religious fervour between 9 a.m. and 9:30 a.m. in the auspicious Mithuna lagnam as per Vaikhanasa Agama. This was followed by Snapana Tirumanjanam to Utsava murthies between 11 a.m. and 12 noon.

Temple DyEO Smt Shanti, AEO Sri Durgaraju and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2021 మే 23: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు.

సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 9 నుంచి 9.30 గంటల మధ్య మిథున‌ లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముందుగా ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు.

అనంతరం ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.

కాగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 6.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

 ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వ‌తి,ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూపరింటెండెంట్‌ శ్రీ సాతేనాయ‌క్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ నాగ‌రాజు,ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు :
 
తేదీ                            
                         
23-05-2021: ఉదయం – ధ్వజారోహణం           సాయంత్రం – పెద్దశేష వాహనం

24-05-2021: ఉదయం – చిన్నశేష వాహనం     సాయంత్రం – హంస వాహనం

25-05-2021: ఉదయం – సింహ వాహనం    సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం  

26-05-2021: ఉదయం – కల్పవృక్ష వాహనం       సాయంత్రం – సర్వభూపాల వాహనం

27-05-2021: ఉదయం – మోహినీ అవతారం.          సాయంత్రం – గరుడ వాహనం

28-05-2021: ఉదయం – హనుమంత వాహనం.     సాయంత్రం – గజ వాహనం

29-05-2021: ఉదయం – సూర్యప్రభ వాహనం         సాయంత్రం – చంద్రప్రభ వాహనం

30-05-2021: ఉదయం – రథోత్సవం బ‌దులు సర్వభూపాల వాహనం
                        సాయంత్రం – క‌ల్యాణోత్స‌వం,                                      అశ్వవాహనం

31-05-2021; ఉదయం – చక్రస్నానం.             సాయంత్రం – ధ్వజావరోహణం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.