TUMBURU THEERTHA MUKKOTI ON APRIL 6 IN TIRUMALA _ ఏప్రిల్ 5, 6వ తేదీల్లో తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి

TIRUMALA, 02 APRIL 2023: The most important among the torrent festivities, Tumburu Theertha Mukkoti will be observed in Tirumala on April 6.

As the event is set to take place almost three years after Covid pandemic, heavy devotee rush is being anticipated in the trekking path of Tumburu Theertham.

The devotees will be allowed for Tumburu Theertham from 6am onwards till 5pm on April 5 and again 5am to 12noon on April 6. Those who have obesity, cardiac problems, other chronic diseases are appealed not to trek the path keeping in view their health safety and security.

The devotees are also appealed not to bring any cooking materials through continuous announcements in Radio and Broad Casting.

The Annaprasadam department will supply the “Ready to Eat” food packets will be distributed at the Papavinasanam Dam to the devotees.

The Medical wing will be ready with ambulance and a team of doctors to meet any exigencies. Enough number of Srivari Sevaks to be deployed to Annaprasadam, Health, Vigilance departments to provide services to the multitude of visiting pilgrims on the occasion. The personnel from Vigilance, forest muzdoors will be deployed at certain points all through the trekking path for the safety of devotees.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 5, 6వ తేదీల్లో తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి

– ఏప్రిల్ 5వ తేదీ ఉదయం నుండి 6వ తేదీ మధ్యాహ్నం వరకు భక్తులకు అనుమతి

– ముక్కోటికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు

తిరుమల, 2023 ఏప్రిల్ 02: తిరుమల శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఏప్రిల్ 5, 6వ తేదీల్లో ఘనంగా జరుగనుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

ఇందులో భాగంగా తుంబురు తీర్థానికి ఏప్రిల్ 5న ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 6వ తేదీన ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద భక్తులకు అల్పాహారం, అన్న‌ప్ర‌సాదాలు, త్రాగునీరు అందిస్తారు. ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు. 

తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సింది వస్తుంది కావున గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు.

భ‌క్తులు వంట సామగ్రి, క‌ర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది.

పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.

ఫాల్గుణ మాసంలో ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టిటిడి అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.