ELABORATE ARRANGEMENTS FOR V DAY-TTD EO _ వైకుంఠ ఏకాద‌శికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirumala, 7 Jan. 22: All the departments in TTD are gearing up for Vaikunta Ekadasi Dwara Darshanam, said TTD EO Dr KS Jawahar Reddy.

Speaking after a review meeting with all HoDs in Tirumala at Annamaiah Bhavan on Friday, the EO said the Vaikuntha Dwara Darshanam will be provided to pilgrims for 10days from January 13 to 22.

On January 13, after morning rituals, the darshan will commence from 1:45 am onwards. He said TTD has already released SED, SSD, and SRIVANI, Virtual Seva tickets online for the benefit of pilgrims.

He said the Slotted Sarva Darshanam tokens will be issued to Tirupati locals at five different centers as in the case of last year. In view of the scare Omicron cases, only locals will be issued on a first come first serve basis for all the ten days, he added.

On the accommodation front he said, due to the renovation of nearly 1300 rooms out of 7500 rooms available in Tirumala, the devotees are requested to take accommodation in Tirupati and have darshan in Tirumala without any inconvenience, he maintained.

He said the procession of Golden Chariot on Vaikuntha Ekadasi day in the four Mada streets will be live telecasted for the sake of devotees. On Vaikuntha Dwadsi day, Chakra Snanam will be performed in Swami Pushkarini between 5 am and 6 am in Ekantam.

On laddus he said, a buffer stock of six lakh laddus will be maintained every day by operating 41 counters as against the present 31 counters.

Earlier, during the review meeting, he instructed all the HoDs to ensure necessary Covid measures at Health, Medical, Kalyanakatta, Annaprasadam, Reception areas, and in all the places where the pilgrim influx is more. Required number of Srivari Sevaks also shall also be deployed to render services to pilgrims. TTD cops in coordination with Police shall have to regulate traffic in Tirumala, he directed the concerned.

“In view of fast-spreading Omicron cases across the country, either two doses of vaccine report or RTPCR negative test taken 48hours before which is mandatory for all the devotees coming for darshan of Srivaru. The devotees are also requested to co-operate with TTD following all Covid norms of observing social distancing, wearing masks, and using sanitizers without fail”, he maintained.

Earlier, the EO also reviewed the ongoing works in Ghat Roads and greenery development.

Additional EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao, FACAO Sri Balaji, SE 2 Sri Jagadeeshwar Reddy, Health Officer Dr Sridevi, Deputy EOs Sri Ramesh Babu, Sri Lokanatham, Sri Bhaskar, Sri Selvam, Smt Padmavati, CMO Dr Muralidhar and other HoDs were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైకుంఠ ఏకాద‌శికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుమ‌ల‌, 2022 జ‌న‌వ‌రి 07: తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 13న వైకుంఠ ఏకాద‌శి, 14న ద్వాద‌శి సంద‌ర్భంగా భ‌క్తుల సౌక‌ర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం అన్ని విభాగాల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

స‌మీక్ష అనంత‌రం ఈవో మాట్లాడుతూ జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌న్నారు. జ‌న‌వ‌రి 13 వైకుంఠ ఏకాద‌శి నాడు ఉద‌యాత్పూర్వం కైంక‌ర్యాల అనంత‌రం ఉద‌యం 1.45 గంట‌ల నుండి ద‌ర్శ‌నం ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం ఇప్ప‌టికే ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్‌, శ్రీ‌వాణి, వ‌ర్చువ‌ల్ సేవా టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేసిన‌ట్టు చెప్పారు.

గ‌తేడాది లాగానే తిరుప‌తిలోని ఐదు ప్రాంతాల్లో స్థానికుల కోసం స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తామ‌న్నారు. ఒమిక్రాన్ వైర‌స్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో తిరుప‌తి స్థానికుల‌కు మాత్ర‌మే ముందు వ‌చ్చిన వారికి ముందు ప్రాతిప‌దిక‌న 10 రోజుల టోకెన్లు ఒకేసారి అందిస్తామ‌న్నారు. తిరుమ‌ల‌లో యాత్రికులు బ‌స చేసేందుకు దాదాపు 7500 పైగా గ‌దులు ఉండ‌గా ప్ర‌స్తుతం 1300 పైగా గ‌దుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, ఈ కార‌ణంగా భ‌క్తులు వీలైనంత వ‌ర‌కు తిరుప‌తిలోనే గ‌దులు పొంది తిరుమ‌ల‌కు వ‌చ్చి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని కోరారు.

వైకుంఠ ఏకాదశి నాడు ఉద‌యం స్వర్ణర‌థోత్స‌వాన్ని ప్ర‌త్య‌క్ష ప్రసారం చేయాల‌ని, ద్వాద‌శి నాడు ఉద‌యం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం ఏకాంతంగా జ‌రుగుతుంద‌ని తెలిపారు. 6 ల‌క్ష‌ల ల‌డ్డూలు బ‌ఫ‌ర్ స్టాక్ ఉంచుకుంటామ‌ని, ల‌డ్డూ కాంప్లెక్స్‌లో ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న 31 కౌంట‌ర్ల‌కు బ‌దులుగా 41 కౌంట‌ర్లు ప‌ని చేస్తాయ‌ని వివ‌రించారు. అన్న‌ప్ర‌సాదం, క‌ల్యాణ‌క‌ట్ట, వ‌స‌తి క‌ల్ప‌న‌, వైద్యం, ఆరోగ్య విభాగంతోపాటు భ‌క్తుల తాకిడి ఉన్న అన్ని ప్రాంతాల్లో కోవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాల‌న్నారు. అన్ని విభాగాల్లో శ్రీవారి సేవకులు భక్తుల‌కు సేవ‌లందిస్తారని, తిరుమల‌లో పోలీసుల‌తో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు.

కోవిడ్ – 19 మూడ‌వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాలని కోరారు. భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించి భౌతిక‌దూరం పాటించాల‌ని, త‌ర‌చూ శానిటైజ‌ర్‌తో చేతులు శుభ్ర‌ప‌రచుకోవాల‌ని అన్నారు. టిటిడి ఉద్యోగులు, వేలాది మంది సహ భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులు టిటిడి విజిలెన్స్ మరియు సెక్యూరిటి సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. అనంత‌రం ఉద్యాన‌వ‌నాల అభివృద్ధి ప‌నులు, ఘాట్ రోడ్డులో పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌పై స‌మీక్షించారు.

ఈ స‌మీక్ష‌లో అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ శ్రీ‌దేవి, సిఎంవో డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌, డెప్యూటీ ఈవోలు శ్రీ ర‌మేష్ బాబు, శ్రీ లోక‌నాథం, శ్రీ భాస్క‌ర్‌, శ్రీ సెల్వం, శ్రీ‌మ‌తి ఎం.ప‌ద్మావ‌తి ఇతర విభాగాధిప‌తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.