EO INSPECTS GHAT ROAD WORKS _ ఘాట్ రోడ్డు పనులను పరిశీలించిన ఈవో
Tirumala, 7 Jan. 22: TTD EO Dr KS Jawahar Reddy along with Additional EO Sri AV Dharma Reddy inspected the ongoing restoration works in the Second Ghat road on Friday afternoon.
CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఘాట్ రోడ్డు పనులను పరిశీలించిన ఈవో
తిరుమల, 2022 జనవరి 07: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాల్లో జరుగుతున్న పునరుద్ధరణ పనులను శుక్రవారం టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి పరిశీలించారు. భాష్యకార్ల సన్నిధి వద్ద జరుగుతున్న కాంక్రీట్ పనులు, ఇతర మరమ్మతు పనులను తనిఖీ చేశారు.
పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేయాలని ఈవో ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 10వ తేదీ నాటికి మరమ్మతులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని, 11వ తేదీ ఉదయం నుండి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో బ్యారీకేడ్లు, సైన్‌బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మార్గంలో లైట్ వెహికల్స్‌ను మాత్రమే అనుమతించాలని, హెవీ వెహికల్స్‌కు అనుమతి లేదని తెలిపారు. పునరుద్ధరణ పనులను వేగవంతంగా చేపడుతున్న ఇంజినీరింగ్ అధికారులను, కార్మికులను ఈవో అభినందించారు.
ఈవో వెంట అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఇఇ శ్రీ సురేంద్రారెడ్డి, ఆఫ్కాన్ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.