STRIVE FOR SUCCESS OF GO SAMMELAN- TTD JEO _ గోస‌మ్మేళ‌నం విజ‌య‌వంతానికి కృషి చేయాలి : టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

గోస‌మ్మేళ‌నం విజ‌య‌వంతానికి కృషి చేయాలి : టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

తిరుపతి, 2021 అక్టోబరు 18: గోశాల నిర్వ‌హ‌ణ, గో సంర‌క్ష‌ణ, గో ఆధారిత వ్య‌వ‌సాయంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఈ నెల 30, 31వ తేదీల్లో తిరుప‌తిలో నిర్వ‌హించ‌నున్న గోస‌మ్మేళ‌నం విజ‌య‌వంతానికి ఆయా విభాగాల అధికారులు కృషి చేయాల‌ని టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం కోరారు. తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో సోమ‌వారం ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ గోస‌మ్మేళ‌నాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు క‌మిటీలు ఏర్పాటు చేశామ‌ని, అధికారులు ఇప్పటినుంచే ముంద‌స్తు ఏర్పాట్ల‌కు సిద్ధం కావాల‌ని సూచించారు. ఇందులో తిరుమ‌ల రిసెప్ష‌న్‌, తిరుప‌తి రిసెప్ష‌న్‌, అకామిడేష‌న్‌, రిజిస్ట్రేష‌న్‌, కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌, ప్ర‌చారం, ఫుడ్ అండ్ హాస్పిటాలిటి, ర‌వాణా, ఇన్‌ఫ్రాస్ట‌క్చ‌ర్‌, స్టేజ్ డెకరేష‌న్‌, ఎగ్జిబిష‌న్‌, ద‌ర్శ‌నం, స‌న్మాన క‌మిటీలు ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు. మొద‌టి రోజు వెయ్యి మంది, రెండో రోజు వెయ్యి మంది రైతులు విచ్చేస్తార‌ని, వీరంద‌రికీ తిరుచానూరు ప‌ద్మావ‌తి నిల‌యం, తిరుప‌తిలోని 2, 3 స‌త్రాలు, ఎస్వీ విశ్రాంతిగృహం త‌దిత‌ర ప్రాంతాల్లో బ‌స ఏర్పాటు చేయాల‌న్నారు. తిరుమ‌ల‌, తిరుప‌తిలోని అన్న‌దానం డెప్యూటీ ఈవోలు ఆహారం శుచిగా, రుచిగా అందించాల‌ని ఆదేశించారు. స్వామీజీలను ఆహ్వానించే విష‌యంలో ధార్మిక ప్రాజెక్టుల అధికారులు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. రెండు రోజుల కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ఆధ్వ‌ర్యంలో రికార్డు చేయాల‌ని, స‌మాచారాన్ని క్రోడీక‌రించి సావ‌నీర్ రూపొందించేందుకు చీఫ్ ఎడిట‌ర్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని కోరారు. స్టేజి వ‌ద్ద సేవ‌లందించేందుకు త‌గినంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానించాల‌న్నారు.

ఈ స‌మావేశంలో యుగ తుల‌సి ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ మ‌రియు టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు శ్రీ శివ‌కుమార్‌, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ అధికారి శ్రీ విజ‌య‌సార‌థి, గోశాల సంచాల‌కులు డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి త‌దితరులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

Tirupati, 18 October 2021: TTD Joint Executive Officer Sri Veerabrahmam, has directed officials of all departments to strive for the success of Go Maha Sammelan held at Tirupati from October 30-31 and aimed to train farmers and spread awareness on maintenance of Goshalas, Go Samrakshana and Go-based organic farming.

Speaking on the occasion the TTD JEO said all the committees set up for Sammelan should make preparations in advance.

The committees comprised of Tirumala and Tirupati reception, accommodation, registration, programs conduction, publicity, food and hospitality, transport, infrastructure, stage decorations, exhibitions, Darshan, and felicitation.

He said 1000 farmers will attend on both days and their accommodation should be organised at Padmavati Nilayam, Tiruchanoor and 2-3 Choultries and SV guesthouse at Tirupati.

Among others he directed Annadanam officials to provide delicious food, HDPP officials to coordinate on receiving the Pontiffs of mutts, SVBC to record the entire proceedings of Go Sammelan, and the Chief Editor of Sapthagiri to compile a souvenir of the proceedings, and finally Srivari Sevakulu to assist at the stage of Sammelan

Yuga Tulasi foundation chairman and former board member Sri Shivakumar, HDPP programming officer Sri Vijay Saradhi, Goshala director Dr Harnath Reddy were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI