EO INSPECTS GARDENS IN TIRUMALA _ ఉద్యాన‌వ‌నాల‌ను ప‌రిశీలించిన ఈవో

Tirumala, 7 Jan. 22: TTD EO Dr KS Jawahar Reddy accompanied by CVSO Sri Gopinath Jatti inspected the greenery points developed in Tirumala on Friday.

During his inspection at the garden which is under development near the Bata Gangamma Gudi area adjacent to Srivari Seva Sadan in a sprawling 7-acre area, the EO planted Mirabel rose (the type of red rose which is extensively used in garlands) plant. He also went through the roses, jasmine, Ixora, lilies, paneer leaves, and chrysanthemum plantations being developed in this area by Sri City. 

The Greenery Project In-charge of Sri City, Sri Madhu Reddy explained to EO that they would be able to grow 100-150kilos of flowers that will be used in the daily worship of Sri Venkateswara Swamy in the next couple of months. He also said they are growing turmeric also required for daily Kainkaryams.

The EO also inspected the scathing, poly house, seating arrangements coming up in the spacious green cover. Later he also inspected the greenery developed at Filter House, SMC, and GMC circles. 

Garden Deputy Director Sri Srinivasulu, VGO Sri Bali Reddy and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఉద్యాన‌వ‌నాల‌ను ప‌రిశీలించిన ఈవో

తిరుమ‌ల‌, 2022 జ‌న‌వ‌రి 07: తిరుమ‌లలో అభివృద్ధి చేసిన ఉద్యాన‌వ‌నాలను టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శుక్ర‌వారం సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టితో క‌లిసి ప‌రిశీలించారు.

శ్రీ‌వారి సేవా స‌ద‌న్ ప‌క్క‌న ఉన్న బాట గంగ‌మ్మ గుడి స‌మీపంలో ఏడు ఎక‌రాల విస్తీర్ణంలో జ‌రుగుతున్న ఉద్యాన‌వ‌న అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా పూల‌మాల‌ల త‌యారీకి వినియోగించే ప్ర‌త్యేక‌మైన మిర‌బుల్ రోజ్ ర‌కం మొక్క‌ను ఈవో నాటారు. అదేవిధంగా, శ్రీ‌సిటి సంస్థ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న రోజాలు, మ‌ల్లె, నూరు వ‌రహాలు, లీల్లీలు, ప‌న్నీరాకు, చామంతి మొక్క‌ల పెంప‌కాన్ని ప‌రిశీలించారు.

శ్రీ‌వారికి రోజువారీ కైంక‌ర్యాల‌కు వినియోగించేందుకు 100 నుండి 150 కిలోల పుష్పాల‌ను సిద్ధం చేస్తామ‌ని, మ‌రికొన్ని ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని శ్రీ‌సిటి గ్రీన‌రీ ప్రాజెక్టు ఇన్‌చార్జి శ్రీ మ‌ధురెడ్డి ఈ సంద‌ర్భంగా ఈవోకు వివ‌రించారు. ఆల‌య అవ‌స‌రాల కోసం ప‌సుపును కూడా పండిస్తున్న‌ట్టు చెప్పారు. అనంత‌రం ఉద్యాన‌వ‌నంలో జ‌రుగుతున్న పాలిహౌస్‌, సీటింగ్‌ ఏర్పాట్ల‌ను ఈవో ప‌రిశీలించారు. ఆ త‌రువాత ఫిల్ట‌ర్ హౌస్‌, ఎస్ఎంసి, జిఎన్‌సి, ముళ్ల‌గుంట కూడ‌ళ్ల‌లో పూల‌మొక్క‌ల పెంప‌కాన్ని ప‌రిశీలించారు.

ఈవో వెంట ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు, విజివో శ్రీ బాలిరెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.