Rs.4.20 CRORE DONATION TO SVBC _ ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.4.20 కోట్లు విరాళం

Tirumala,16 September 2021: Sri Ramakrishna resident of Vijayawada and representative of Boston based devotee Sri Ravi Ika has on Thursday morning donated Rs.4.20 crore to the SVBC trust.

 

He handed over the cheque for the same towards the donation amount to TTD Additional EO and SVBC MD Sri AV Dharma Reddy at the Ranganayakula Mandapam in Srivari temple after darshan.

            

Speaking on the occasion the TTD Additional EO said that Sri Ravi Ika has so far donated over Rs.40 crores to various trusts of TTD.

 

He said Sri Ravi has given first instalment of Rs.4.20 crore to fund the SVBC modernisation program to buy advanced cameras and other technical equipment costing Rs.7 crore in all.

 

He said with these donations the SVBC will get fully equipped with state of the art cameras and the latest HD technical equipment to provide a display of life-like images of all Vahana sevas sand rituals in Tirumala.

 

SVBC CEO Sri Suresh Kumar was also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.4.20 కోట్లు విరాళం

తిరుమల, 2021 సెప్టెంబ‌రు 16: అమెరికాలోని బోస్టన్ లో ఉంటున్న శ్రీ రవి ఐకా తరఫున వారి ప్రతినిధి విజయవాడకు చెందిన శ్రీ రామకృష్ణ ప్రసాద్ గురువారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.4.20 కోట్లు విరాళం అందించారు.

ఈ మేర‌కు విరాళం చెక్కును తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ శ్రీ రవి ఐకా ఇప్పటికే టిటిడికి చెందిన పలు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు. ఎస్వీబీసీలో కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ.7 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారని, ప్రస్తుతం తొలివిడతగా రూ.4.20 కోట్లు అందజేశారని చెప్పారు. ఈ మొత్తంతో ఎస్వీబీసీకి అవసరమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈఓ శ్రీ సురేష్ కుమార్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.