GARUDA SEVA TRIAL- RUN HELD _ తిరుమలలో ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

EO OBSERVES THE GALLERIES

TIRUMALA, 18 SEPTEMBER 2024: A trial-run of Garuda seva on the occasion of Pournami Garuda Seva, was observed in Tirumala on Wednesday evening.

Sri Malayappa Swamy atop the Garuda Vahanam blessed His devotees along the four mada streets from 7pm to 9pm.

TTD EO Sri J Syamala Rao along with the Additional EO Sri Ch Venkaiah Chowdhary and CVSO Sri Sridhar, observed the three rope security, galleries along the four Mada streets, entry and exit points, the performance of dance troupes, Paraphernalia in front of Vahanam procession.

Temple DyEO Sri Lokanatham, EE Sri Subramanyam, VSOs Sri Surendra, Sri Ram Kumar, other officials were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

తిరుమల, 2024 సెప్టెంబ‌రు 18: ఈ ఏడాది అక్టోబ‌ర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం పౌర్ణమి సందర్భంగా టీటీడీ మాదిరి గరుడ సేవను నిర్వహించింది.

సాధారణంగా ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సమీక్షించుకునేందులో భాగంగా టీటీడీ ఈ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ.

రాత్రి 7 నుండి 9 గంటల నడుమ జరిగిన ఈ గరుడ సేవలో టీటీడీ ఈవో శ్రీ శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మరియు సి వి ఎస్ ఓ శ్రీ శ్రీధర్ లతో కలిసి నాలుగు మాడవీధుల్లో భద్రత, తాగునీరు పంపిణీ, అన్నప్రసాద వితరణ, శ్రీవారి సేవకుల సేవలు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, ఇతర ఇంజినీరింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

కాగా శ్రీవారి గరుడ వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారి ఆలయ డిప్యూటీవో శ్రీ లోకనాథం, ఈ ఈ సుబ్రహ్మణ్యం, వీజీవోలు శ్రీ సురేంద్ర, శ్రీ రామ్ కుమార్ ఇతర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.