GODDESS PADMAVATHI DECKED AS VENNEMUDDA KRISHNA _ ముత్యపుపందిరి వాహనంపై వెన్నముద్దకృష్ణుని అలంకారంలో శ్రీ అలమేలుమంగ

Tiruchanur, 13 Nov. 20: On the third morning as as part of ongoing annual Kartika brahmotsavams at Tiruchanur on Friday, Goddess Padmavathi Devi decorated as Vennemuddaa Krishna blessed devotees on Mutyapu Pandiri Vahanam. 

Both the Senior and Junior Pontiffs of Tirumala, JEO Sri P Basanth Kumar, CVSO Sri Gopinath Jatti, CE Sri Ramesh Reddy, DyEO Smt Jhansi Rani and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

ముత్యపుపందిరి వాహనంపై వెన్నముద్దకృష్ణుని అలంకారంలో శ్రీ అలమేలుమంగ
 
తిరుపతి, 2020 న‌వంబ‌రు 13: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై వెన్నముద్దకృష్ణుని అలంకారంలో పిల్లనగ్రోవి, వెన్న ముంతతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
 
ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని, తామ్రనదీతీరంలో లభిస్తాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం ఫలంగా చేకూరుతుంది.
 
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీమతి మల్లీశ్వరి, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, విఐలు శ్రీ సురేష్ రెడ్డి, శ్రీ మహేష్, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.