GRAND SRI RAMAKRISHNA THEERTHAM MUKKOTI CELEBRATED_ వేడుకగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
Tirumala, 21 Jan. 19: As per traditions the Mukkoti festival of Sri Ramakrishna Thirtham was grandly celebrated today by the TTD in the deep seshachachala forests.
Vedic pundits came to the Thirtham created by Sri Ramakrishna Maharshi in a procession from Srivari temple at 10 am and performed with honey, milk, curd and scented waters to idols of Sri Ramachandra and Sri Krishna Besides special pujas and Naivedyam.
TTD had made elaborate arrangements at the papavinasanam dam to provide Anna Prasadam like Pongal, upma, and sambar Annam pulihara and curd rice besides drinking water .for benefit of devotees. The TTD engineering department had also put up temporary ladders in. the forest path to the Sri Ramakrishna Thirtham for convenience of devotees.
Temple DyEO Sri Harindranath and Peishkar Sri Ramesh babu and other officials participated in the holy event in the thick Tirumala forest ranges.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
వేడుకగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
జనవరి 21, తిరుమల 2019: తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణతీర్థం ముక్కోటి సోమవారం వేడుకగా జరిగింది. ప్రతిఏటా పుష్యమి మాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.
శ్రీవారి ఆలయం నుంచి వైదికులు మంత్రోచ్ఛారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 10 గం||లకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు.
రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాపవినాశనం డ్యామ్ వద్ద పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు పంపిణీ చేశారు. తీర్థం వద్ద టిటిడి వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి భక్తులకు మందులు పంపిణీ చేశారు. టిటిడి ఇంజినీరింగ్, అటవీ విభాగాల ఆధ్వర్యంలో మార్గమధ్యంలో పలుచోట్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా కొయ్య నిచ్చెనలు ఏర్పాటుచేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.