ESSENCE OF VEDA IN SRI PURANDARA DASA KEETANS_ PONTIFF OF VYSARAJA MUTT_ శ్రీ పురందరదాస కీర్తనల్లో వేదాల సారం : శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీ‌శ‌తీర్థ‌స్వామీజీ

@ Tirumala resounded with Dasa keertans
@ Bhajan teams enthusiastically participated
@ In grand Thraimaisika Srivari Metlotsavam

Tirupati, 21 Jan. 19: The essence of Vedas are embedded in the sacred sankeertans of Sri Purandara Dasa, says – Pontiff of Vyasaraja mutt Sri Sri Sri Vidyaseesha Thirtha Swamiji.

Participating in the grand quarterly Srivari Metlotsavam Organised by the TTDs Dasa Sahitya project at the Padala mandapam in Alipiri the Pontiff said great saint poets and devotees of Lord Venkateswara like Sri Thagaraya, Sri Annamacharya and emperor Sri Krishnadevaraya Had spread glory of Lord to entire universe.

He said it was heartening to nite that the TTD organised the Metlotsavam festival so that present day devotees would be inspired to follow in their footsteps. It was a great blessings to start climbing The Tirumala hills at Brahma muhurtam and get darshan of Lord Venkateswara.

Sri Ananda Thirthacharya, the OSD of TTD Dasa Sahitya Project said Devotees from Andhra Pradesh, Telangana, Karnataka and Tamil Nadu has come in a big way and were climbing Tirumala by foot chanting bhajans. The bhajan mandal members were given dharma training, Antakshari programs in Haridasa keertans, competitions and sangeet chitravali programs conducted for them at the third choultry.

The bhajan mandals members were expected to spread the theme of devotion in their regions. Earlier about 3000 bhajan mandal members walked from third choultry to Alipiri padala mandapam chanting sankeertans and performed special pujas at Padala mandapam before climbing the Tirumala.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీ పురందరదాస కీర్తనల్లో వేదాల సారం : శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీ‌శ‌తీర్థ‌స్వామీజీ

దాస పదాలతో మార్మోగిన తిరుమలగిరులు

ఉత్సాహంగా పాల్గొన్న భజనమండళ్ల సభ్యులు

వేడుకగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుపతి, 2019 జనవరి 21: శ్రీ పురందరదాసవర్యుల కీర్తనల్లో వేదాల సారం దాగి ఉందని వ్యాస‌రాజ మఠం పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యాశ్రీ‌శ‌తీర్థ‌స్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం సోమ‌వారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యాశ్రీ‌శ‌తీర్థ‌స్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ శ్రీపురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టిటిడి మెట్లోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు.

ఈ సందర్భంగా దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి ఎందరో మహర్షులు, రాజులు కాలినడకన తిరుమలగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు. భజన మండళ్ల సభ్యులకు టిటిడి మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.

అంతకుముందు భజనమండళ్ల స‌భ్యులు టిటిడి మూడో సత్రం ప్రాంగణం నుండి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. 3000 మందికిపైగా భజనమండళ్ల స‌భ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.