TTD EMPLOYEES ANNUAL SPORTS MEETS FROM FEB 2-17_ ఫిబ్రవరి 2 నుండి 17వ తేదీ వరకు టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు
Tirupati, 21 Jan. 19: The TTDs annual sports competition s will commence from February 2 to 17 and all interested participants should register their named i the TTD welfare department before January 23.
Separate events Wilber held for both men and women in the events foot Ball Badminton, Shuttle, Shot-put, ball throw, lemons On, tennkoit, carroms, chess, throw ball, kabaddi, dodge ball, passing the luggage, run, walk, bucket in the ball, hitting the Indian clubs etc.
The events will be held for 49 years, 40-50 and 50 above in separate contents.
There are events and contests not only for TTD employees but also for, their family members and also for retired TTD employees
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఫిబ్రవరి 2 నుండి 17వ తేదీ వరకు టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు
తిరుపతి, 2019 జనవరి 21: టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ఫిబ్రవరి 2 నుండి 17వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం ఉద్యోగులు జనవరి 28వ తేదీలోపు టిటిడి సంక్షేమ విభాగంలో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో బాల్ బ్యాడ్మింటన్, షటిల్, టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, త్రోబాల్, డాడ్జి బాల్, కబడ్డీ, పాసింగ్ ది లగేజి, పరుగు, నడక పోటీలు, షాట్‌పుట్, బాల్‌త్రో, లెమన్‌స్పూన్, బకెట్ ఇన్ ది బాల్, హిట్టింగ్ ది ఇండియన్ క్లబ్స్ తదితర క్రీడలు ఉన్నాయి. 40 ఏళ్లలోపు, 40 ఏళ్ల నుండి 50 ఏళ్ల లోపు, 50 ఏళ్లు పైన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు, విశ్రాంత ఉద్యోగులకు క్రీడాపోటీలు జరుగుతాయి.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.