HANUMAN JAYANTI OBSERVED WITH RELIGIOUS GEITY _ తిరుమల ఆకాశ‌గంగ వ‌ద్ద ఘనంగా హనుమజ్జయంతి వేడుక‌లు

TIRUMALA, 14 MAY 2023: The seven hills on Sunday echoed with Ramanama-Anjaneya Japam in connection with Hanuman Jayanti festivities.

The day started with a special abhishekam to the Bedi Anjaneya Swamy temple located opposite Tirumala shrine, followed by Abhishekam and special pujas to Anjana sameta Sri Balanjaneya Swamy at Akasa Ganga. TTD JEO Sri Veerabrahmam took part in this fete. Among others, CEO SVBC Sri Shanmukh Kumar, DyEOs Sri Lokanatham, Sri Selvam, VGOs Sri Bali Reddy, Sri Giridhar Rao and others were also present.

Later he also presented vastrams on behalf of TTD to Sri Japali Anjaneya. In the evening special pujas were performed to Seventh Mile Sri Prasanna Anjaneya statue.

NADA NEERAJANAM

On the first day, Sri Sachidananda Theertha Swamy of Tapovanam, Tuni in his religious discourse on Nada Neerajanam platform said, Rama-Hanuma Nama Japams will ward off all difficulties in the society and expressed his pleasure over the series of Dharmic programmes mulled by TTD for the welfare of the humanity.

SVVU VC Sri Ranisadasiva Murthy, Annamacharya Project Director Sri Vibhishana Sharma were also present.

DHARMIC PROGRAMMES

The students of TTD schools, recited Rama Japam-Hanuman Chalisa in Akasa Ganga held under the aegis of HDPP. The artistes also presented Annamacharya Hanuman sankeertans on the auspicious occasion. HDPP authorities were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

తిరుమల ఆకాశ‌గంగ వ‌ద్ద ఘనంగా హనుమజ్జయంతి వేడుక‌లు

తిరుమల, 2023 మే 14: తిరుమల క్షేత్రంలోని అంజ‌నాద్రి కొండ‌పై ఆంజ‌నేయ‌స్వామివారు జ‌న్మించిన ఆకాశ గంగ తీర్థం వ‌ద్ద హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌లు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఇందులో భాగంగా ఆకాశ‌గంగ వ‌ద్ద అంజ‌నాదేవి, బాల ఆంజ‌నేయ‌స్వామివారికి అభిషేకం, త‌మ‌ల‌పాకుల‌తో పూజ‌, మ‌ల్లె పూల‌తో అర్చ‌న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం పాల్గొన్నారు.

జపాలి శ్రీ ఆంజనేయ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ :

జపాలి శ్రీ ఆంజనేయ స్వామివారికి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న జెఈఓకు హ‌థీరాంజీ మ‌ఠం మ‌హంతు శ్రీ అర్జున్ దాస్‌జి మహంతు స్వాగ‌తం ప‌లికారు. జాపాలి తీర్థంలో గల శ్రీఆంజనేయస్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

ఈ పూజ కార్య‌క్ర‌మంలో సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబిసి సిఇవో శ్రీ షణ్ముఖ కుమార్‌, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ సెల్వం, విజివో శ్రీ బాలిరెడ్డి, హ‌థీరాంజీ మ‌ఠం ప్రతినిధులు, వైఖాన‌స ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ మోహ‌న‌రంగాచార్యులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి :

శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8 గంటలకు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వ‌హించారు.

మొదటి ఘాట్‌రోడ్డు ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి :

మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.