HANUMANTA VAHANAM HELD _ ఘనంగా హనుమజ్జయంతి

TIRUPATI, 14 MAY 2023: In connection with Hanuman Jayanti on Sunday, Hanumantha Vahana seva was held in Sri Kodandarama Swamy temple in Tirupati in the evening.

Earlier in the day, special pujas were performed to Anjaneya in the temple located opposite to Sri Kodandarama temple.

DyEO Smt Nagaratna and others temple staff, devotees participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఘనంగా హనుమజ్జయంతి
 
తిరుపతి 14 మే 2023: తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయానికి ఎదురుగావున్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శరణాగత భక్తికి ఆదర్శంగా నిల్చిన ఆంజనేయస్వామివారి జయంతిని టీటీడీ  ఆనవాయితీగా నిర్వహిస్తోంది. 
 
ఈ సందర్భంగా ఉదయం శ్రీ సీతారామ‌ల‌క్ష్మ‌ణ‌స్వామి ఉత్స‌వ‌మూర్తులను శ్రీ ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యానికి వేంచేపు చేశారు. 
 
శ్రీ ఆంజనేయస్వామిమూలవర్లకు, శ్రీసీతారామ, లక్ష్మణ స్వామివార్ల ఉత్సవర్లకు వైభవంగా అభిషేకం నిర్వ‌హించారు. సాయంత్రం శ్రీ కోదండరామాలయం నుండి ఊరేగింపుగా వెళ్లి  శ్రీ ఆంజనేయస్వామివారికి వస్త్రం సమర్పించారు. రాత్రి 7 నుండి హనుమంత వాహనసేవ వైభవంగా జ‌రిగింది.
 
శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు. దాస్య‌భక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ చలపతి  పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.