HANUMANTHA VAHANAM AND CHAKRASNANAM HELD _ హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప విహారం

TIRUMALA, 28 JANUARY 2023: The first half of Vahana Sevas in the morning concluded with Hanumantha Vahanam.

This was the fourth one in the Saptha Vahana series in Radhasaptami.

Every inch of the galleries surrounding the four mada streets in Tirumala have been occupied by devotees.

Tirumala witnessed sea of humanity on Saturday for the one day Brahmotsavam.

As soon as the Hanumantha Vahana Seva concluded between 1pm and 2pm, Sri Sudarshana Chakrattalwar was brought from temple to Swamy Pushkarini. After a brief Tirumanjanam to Chakrattalwar, the sacred Chakra Snanam was performed between 2pm and 3pm.

Board members Sri Ramulu, Sri Ashok Kumar, Sri Madhusudhan Yadav, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, Temple DyEO Sri Ramesh Babu and others were present.                                               

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప విహారం

తిరుమల, 28 జనవరి 2023: తిరుమలలో శనివారంనాడు ‘రథసప్తమి’ ఉత్సవం సందర్భంగా నాలుగో వాహనమైన హనుమంత వాహనసేవ వైభవంగా జరిగింది.

హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి (మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు) :

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

టిటిడి బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ మొరంశెట్టి రాములు, శ్రీ మారుతి ప్రసాద్, శ్రీ మధుసూదన్ యాదవ్, జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు ఇత‌ర టిటిడి అధికారులు ఈ వాహ‌న సేవ‌లో పాల్గొన్నారు.

వైభవంగా చక్రస్నానం

రథసప్తమి సందర్భంగా శ‌నివారం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్య చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీవరాహస్వామివారి ఆలయం వద్ద గల స్వామిపుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడయ్యాడు. అధికారులు, భక్తులు పుష్కరిణిలో పవిత్రస్నానాలు ఆచరించారు.

టిటిడి బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ మొరంశెట్టి రాములు, శ్రీ మారుతి ప్రసాద్, శ్రీ మధుసూదన్ యాదవ్, జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు ఇత‌ర టిటిడి అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.