SENIOR OFFICERS VIGIL ARRANGEMENTS FOR PILGRIMS IN GALLERIES _ మాడ వీధుల్లో సీనియర్‌ అధికారుల పర్యవేక్షణ

Tirumala, 28 January 2023: Under the instructions TTD Trust Board Chairman Sri YV Subba Reddy the arrangements for Radhasaptami have been made by TTD in an elaborate manner.

Following the directives of TTD EO Sri AV Dharma Reddy, when the entire Vahana Sevas from dawn to dusk were carried out meticulously under the supervision of JEO (H&E) Smt Sada Bhargavi, the Annaprasadam, Water, Medical and Security arrangements were looked after by JEO Sri Veerabrahmam.

Senior officers from TTD have been deputed to each Mada street to supervise the arrangements in galleries of East, West, North and South in two shifts from 3am to 1pm and again from 1pm till completion of last vahanam.

FACAO Sri Balaji, CE Sri Nageswara Rao executed overall supervisory duties of four mada streets assisted by senior officers, EE Sri Mallikharjuna in East, SE Sri Satyanarayana in West, EE Sri Venugopal in West and EE Sri Krishna Reddy in South mada streets.

Additional FACAO Sri Ravi Prasadudu, CAuO Sri Sesha Sailendra, CAO Sri Venkatramana, Estates Special Officer Sri Mallikharjuna co-ordinated with officials in each mada street and ensured hassle free arrangements for devotees with the help of deputation staff, Srivari Sevaks, Scouts and Guides.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మాడ వీధుల్లో సీనియర్‌ అధికారుల పర్యవేక్షణ

తిరుమల, 28 జనవరి 2023: టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆదేశాల మేరకు జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం ర‌థ‌స‌ప్త‌మినాడు భ‌క్తులకు అందుతున్న సౌక‌ర్యాల‌ను పర్యవేక్షించారు. నాలుగుమాడ వీధుల్లో సీనియర్‌ అధికారుల‌ను నియమించారు. వీరు కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకొని మరింత సమర్థవంతంగా సకాలంలో భక్తులకు సేవలందించే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టారు.

నాలుగు మాడ వీధుల‌కు క‌లిపి ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావుకు ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అదేవిధంగా, తూర్పు మాడ వీధిలో ఇఇ శ్రీ మల్లికార్జున ప్రసాద్, ప‌డ‌మ‌ర మాడ వీధిలో ఎస్ఇ శ్రీ టివి.సత్య నారాయణ, ద‌క్షిణ మాడ వీధిలో ఇఇ శ్రీ జి.వి.కృష్ణారెడ్డి, ఉత్త‌ర మాడ వీధిలో ఇఇ శ్రీ డి.వేణుగోపాల్ భ‌క్తులకు అందుతున్న సేవ‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు. అదేవిధంగా అదనపు ఎఫ్ఏసిఏఓ శ్రీ రవిప్రసాదు, సిఏఓలు శ్రీ శేషశైలేంద్ర, శ్రీ వెంకటరమణ, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి శ్రీ మల్లికార్జున ఇతర అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఏర్పాట్లు చేశారు. మాడ వీధుల్లో వీరి పర్యవేక్షణలో ఇతర అధికారులు, ఉద్యోగులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.