JAMMU TEMPLE TO COMPLETE IN 18 MONTHS -TTD CHAIRMAN _ ఏడాదిన్నరలో జమ్మూ ఆలయ నిర్మాణం పూర్తి-టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

TIRUMALA, 10 NOVEMBER 2021:  TTD will take up Hindu Dharma Prachara in a big way even in North India and the construction of Sri Venkateswara Swamy temple in Jammu will be completed in a span of one and a half years, said TTD Chairman Sri YV Subba Reddy.

Smt Vemireddi Prasanthi Reddy took over charge as the TTD Advisory Board Chairman in New Delhi on Wednesday. Taking part in this event as Chief Guest, the TTD Trust Board Chief Sri YV Subba Reddy said that the Delhi Board will render service to the development of temples in Northern India, including Jammu, Delhi Kurukshetra. TTD has sought the Rama Janmabhoomi temple construction Committee to allot some land and based on their recommendation, the construction of a temple or Bhajana Mandir will be taken up, he added. 

Under the instructions of the Honourable CM of AP, the Chairman also said that TTD has taken up initiatives to encourage farmers in Goadharita Vyavasayam. TTD will procure the products from such farmers and utilize the same to prepare the prasadams at Tirumala temple.

Later he also took part in the Gopuja held at the Srivari temple in New Delhi. MP Sri V Prabhakar Reddy, Chennai Local Advisory Committee Chief Sri Sekhar Reddy were also present

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఉత్తరాదిలోనూ పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం – ఏడాదిన్నరలో జమ్మూ ఆలయ నిర్మాణం పూర్తి

– టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 10 నవంబరు 2021 ;ఉత్తరాదిలోనూ పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. జమ్మూలో టీటీడీ నిర్మించనున్న శ్రీవారి ఆలయ నిర్మాణం ఏడాదిన్నలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

ఢిల్లీ లోని టీటీడీ ఆలయ సలహా మండలి చైర్ పర్సన్ గా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్చకులు వీరికి సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు.

అనంతరం శ్రీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉత్తరాదిలో ఆలయాల విస్తరణకు ఢిల్లీ సలహా మండలి కృషి చేస్తుందని చెప్పారు. ఢిల్లీ, కురుక్షేత్ర సహా పలుచోట్ల టీటీడీ కి ఆలయాలున్నాయని తెలిపారు. జమ్ములో ఆలయ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేశామని, 18 నెలల్లో ఆలయ నిర్మాణణం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. టీటీడీకి అయోధ్యలో స్థలం కేటాయించాలని రామజన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీని కోరామని చెప్పారు. ఆలయనిర్మాణ కమిటీ నుంచి వచ్చే స్పందన మేరకు అక్కడ ఆలయం లేదా భజనమందిరం నిర్మాణం పై నిర్ణయం తీసుకుంటామన్నారు.

గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి శ్రీ వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఇందుకోసం ఎపి రైతు సాధికారిక సంస్థతో
ఎంఓయు చేసుకున్నట్లు శ్రీ సుబ్బారెడ్డి వివరించారు.

గోఆధారిత వ్యవసాయం తో పండించిన పంటలను రైతులకు గిట్టుబాటు బాటుధర ఇచ్చి టీటీడీ కొనుగోలు చేస్తుందన్నారు.

తిరుమలశ్రీవారి ప్రసాదాలు, నిత్యాన్నదానం తో పాటు టీటీడీ అవసరాలకు గో ఆధారితఉత్పత్తులను సేకరిస్తామని శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అనంతరం ఢిల్లీ శ్రీవారి ఆలయంలో గోపూజ కార్యక్రమంలో శ్రీ సుబ్బారెడ్డి, శ్రీమతి ప్రశాంతి పాల్గొన్నారు. పాల్గొన్నారు.

రాజ్యసభసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ చెన్నై స్థానికసలహా మండలి సభ్యులు శ్రీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది