LAKSHA KUMKUMARCHANA IN TIRUCHANOOR ON NOVEMBER 29 _ నవంబరు 29న తిరుచానూరులో వర్చువల్ లక్షకుంకుమార్చన

TIRUCHANOOR, 10 NOVEMBER 2021: In connection with the annual Karthika Brahmotsavams in Tiruchanoor which is scheduled from November 30 to December 8, Laksha Kumkumarchana will be performed through a virtual platform on November 29. Due to Covid 19 restrictions, the event will take place in Ekantam.

TTD has fixed the price of the Seva ticket at Rs.1,116 on which two persons will be allowed. These tickets will be released soon online. The devotees will be allowed for darshan within 90 days from the date of booking of an online ticket through the Rs.100 queue line, free of cost. Tickets shall be booked through www.tirupatibalaji.ap.gov.in 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

న‌వంబ‌రు 29న తిరుచానూరులో వ‌ర్చువ‌ల్ ల‌క్ష‌కుంకుమార్చ‌న‌

తిరుపతి, 2021, నవంబరు 10 ; తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో న‌వంబ‌రు 30 నుండి డిసెంబ‌రు 8వ‌ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భాన్ని పుర‌స్క‌రించుకుని న‌వంబ‌రు 29వ తేదీన సోమ‌వారం వ‌ర్చువ‌ల్‌ విధానంలో ల‌క్ష‌కుంకుమార్చ‌న జరుగనుంది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఈ సేవా టికెట్ ధ‌ర‌ను రూ.1,116/-గా టిటిడి నిర్ణ‌యించింది. త్వ‌ర‌లోనే ఈ టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ టికెట్ బుక్ చేసుకున్న గృహ‌స్తులు 90 రోజుల్లోపు రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ‌ద‌ర్శ‌న క్యూలైన్‌లో ఉచితంగా అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చు. ద‌ర్శన‌ స‌మ‌యంలో గృహ‌స్తుల‌కు ఉత్త‌రీయం, ర‌విక‌, అక్షింత‌లు అందిస్తారు. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు.


టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.