JYESTABHISHEKAM COMMENCES IN GT_ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం
Tirupati, 22 July 2018: The annual Jyestabhishekam commenced on a religious note in the famous shrine of Sri Govinda Raja Swamy temple in Tirupati on Sunday.
Every year this festival is being observed in Ashada month on the advent of Jyesta star.
Earlier during the day Snapana Tirumanjanam was performed to deities.
On first day, the veda pundits performed Kavacha Adhivasam, removal of armour on deities amidst chanting of veda mantras under the supervision of chief Priest of the temple Sri Srinivasa Deekshitulu.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం
తిరుపతి, 2018 జూలై 22: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఆషాడ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, అర్చన నిర్వహించారు. ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు ఆలయ ప్రధానార్చకులు శ్రీ అర్చకం శ్రీనివాసదీక్షితులు ఆధ్వర్యంలో ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి వరలక్ష్మి, ఏఇఓ శ్రీ ఉదయభాస్కర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ జ్ఙానప్రకాష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.