KARTHIKA MASA SPECIAL PUJAS COMMENCES BY TTD _ క‌పిల‌తీర్థం, ధ్యానారామంలో కార్తీక మాస పూజ‌లు ప్రారంభం

Tirupati, 16 Nov. 20: On the occasion of the auspicious first Monday of the holy Karthika month, TTD organised special at Sri Kapileswara Swamy temple in Tirupati.

Special pujas included Sankalpam, Kalasha puja and Ganapati Puja to commence with and other festivities were held for Sri Uma Maheshwara on the eve of Karthika Diksha.

Vedic Scholar Sri Rani Sadasivamurthy of National Sanskrit University gave a discourse on the significance of Karthika month and the benefits of Sivarchana.

TTD Additional EO Sri A V Dharma Reddy participated in this puja held at the temple premises. TTD Asthana Vidhwan Sri Garimella Balakrishnan Prasad rendered Annamacharya Sankeertans.

TTD is conducting Trilochana Gauri Vratam on November 17 and Nagula Chavati Vratam on November 18 in the Sri Kapileswara Swamy temple.

AT DHYANARAMAM

 As part of auspicious Karthika Monday  celebrations Rudrabhisekam with holy rituals of Namakam, Chamakam, Maha Harati were performed at the Dhyanaramam under the supervision of vice-chancellor of SV Vedic University, Acharya Sannidhanam Sudarshana Sharma.

Sri Kapleswara Swamy temple DyEO Sri Subramanyam is supervising the arrangements of these special Karthika Masa Deeksha Vrata Pujas.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

క‌పిల‌తీర్థం, ధ్యానారామంలో కార్తీక మాస పూజ‌లు ప్రారంభం

తిరుపతి, 2020 న‌వంబరు 16 : కార్తీక మాసం తొలి సోమ‌వారాన్ని పుర‌స్క‌రించుకుని టిటిడి ఆధ్వ‌ర్యంలో క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య ప్రాంగ‌ణం, ధ్యానా‌రామంలో  శివార్చ‌న‌లు, రుద్రాభిషేకం, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. క‌పిల‌తీర్థంలో కార్తీక మాస దీక్ష ప్రారంభం సంద‌ర్భంగా ఉమా మ‌హేశ్వ‌ర‌స్వామికి విశేష పూజ‌లు నిర్వ‌హించారు. సంక‌ల్పం, క‌ల‌శ పూజ‌, గ‌ణ‌ప‌తి పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. వేద విశ్వ విద్యాల‌‌యం ఆచార్యులు డోలి సుబ్ర‌మ‌ణ్య శాస్త్రి ఆధ్వ‌ర్యంలో ఈ కార్యక్ర‌మాలు జ‌రిగాయి.  ‌  

ప్ర‌ముఖ పండితులు, జాతీయ సంస్కృత విశ్వ విద్యాల‌యం ఆచార్యులు రాణి స‌దాశివ‌మూర్తి కార్తీక మాసం ప్రాశ‌స్త్యం, శివార్చన ఫ‌లితాలు, కార్తీక సోమ‌వారాల విశిష్టత గురించి వివ‌రించారు. అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ ప్ర‌సాద్ బృందం అన్న‌మాచార్య సంకీర్త‌న‌లు ఆల‌పించారు.

శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య ప్రాంగ‌ణంలో న‌వంబ‌రు 17వ తేదీ మంగ‌ళ‌వారం ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు త్రిలోచ‌న గౌరి వ్ర‌తం, 18వ తేదీ నాగుల చ‌వితి వ్ర‌తం నిర్వ‌హించ‌నున్నారు.  

ధ్యానా‌రామంలో …

తొలి కార్తీక సోమ‌వారం సంద‌ర్భంగా అలిపిరి స‌మీపంలోని ధ్యానారామంలో వేద విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో మ‌హాశివుడికి రుద్రాభిషేకం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా న‌మ‌కం, చ‌మ‌కం, మ‌హాహ‌ర‌తి జ‌రిగాయి. కార్తీక మాసం ముగిసే వ‌ర‌కు ప్ర‌తి రోజు ఉద‌యం 6.00 నుండి 6.45 గంట‌ల వ‌ర‌కు ధ్యానారామంలో రుద్రాభిషేకం నిర్వ‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు పాల్గొన్నారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.