KSHEERADHIVASAM FETE HELD AT SV TEMPLE IN AMARAVATI _ వెంకటపాళెంలోని శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం

Tirupati, 06 June 2022: As part of ongoing Maha Samprokshana celebrations at SV temple in Amaravati, Venkatapalem, Ksheeradhivasam fete was held on Monday.

 

In this connection Kumbha Aradhana, Ukta Homam, rituals were performed ahead of Ksheeradhivasam fete (special Abhisekam with milk) to ward off all Doshams. Later in the evening Homas and Yagashala programs were conducted.

 

Tirumala Srivari temple Chief Archaka Sri Venugopal Deekshitulu, Agama Advisor Dr  Vishnu Bhattacharyulu, DyEO Sri Gunabhushana Reddy, Dharmic Projects Officer Sri Vijayasaradhi, AEO Sri Dorasami Naik and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వెంకటపాళెంలోని శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం

తిరుపతి, 2022 జూన్ 06: అమరావతిలోని వెంకటపాళెంలో శ్రీవారి ఆలయంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాల్లో రెండో రోజు సోమ‌వారం శాస్త్రోక్తంగా క్షీరాధివాసం నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉదయం స్వామివారి శక్తిని నింపిన కుంభాల‌కు ప్ర‌త్యేక ఆరాధ‌న‌ నిర్వహించారు. ఆ తరువాత ఉక్త హోమాలు, క్షీరాధివాసం చేపట్టారు. శ్రీ‌వారి విగ్ర‌హ‌నికి వేద మంత్రాల మ‌ధ్య పాల‌తో విశేషంగా అభిషేకం (క్షీరాధివాసం) చేయ‌డం వ‌ల్ల దోషాలు తొల‌గిపోతాయ‌ని అర్చ‌కులు తెలిపారు. సాయంత్రం హోమాలు, యాగ‌శాల వైదిక కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

ఈ కార్య‌క్ర‌మంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాలదీక్షితులు, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, డెప్యూటీ ఈవో శ్రీ గుణ‌భూష‌ణ్‌రెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజ‌య‌సార‌థి, ఎఈవో శ్రీ దొరస్వామి నాయక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.