TTD TO ACT STRINGENTLY ON BASELESS CAMPAIGNERS AGAINST SRIVARI TRUST _ శ్రీవాణి ట్రస్ట్ పై అవాస్తవ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు

·      ALLEGATIONS FOR PERSONAL & POLITICAL GAINS PAINFUL

 Tirumala, 06 June 2022: TTD on Monday strongly refuted the baseless campaign against Srivani Trust made allegedly for political and personal gains by vested interests.

In a statement on Monday evening, the TTD said an attempt is being made to foil the noble objective to reach Sanatana Hindu Dharma to remote areas through temple building activity with the funds of Srivani Trust through baseless mud-slinging campaign.

He said it has become a regular practice to heap such allegations on the Hindu Dharmic institutions like TTD with political and personal publicity intentions and playing with the sentiments of the devotees.

The activities of Srivani trust has grown by leaps and bounds and successfully eclipsed the racket of brokers in Srivari Darshan at Tirumala. Those who could afford tickets are now getting VIP break Darshan tickets of Srivani without any recommendation letters or clutches of brokers.

The TTD said every rupee collected through the Srivani trust is spent for building new SV temples in remote areas and repairs to dilapidated and ancient temples.

Last year 501 temples were built in both Telugu states and have sanctioned plans to build 1030 more temples in the next two years of which some are at various stages of construction.

It is painful that in the backdrop of such ground realities some vested elements are spreading baseless allegations on the functioning of Srivani trust

TTD has warned that legal action will be initiated on such vested interests and those who upload such baseless articles on social media.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవాణి ట్రస్ట్ పై అవాస్తవ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు
– వ్యక్తిగత, రాజకీయ ప్రచారం కోసం టీటీడీపై బురద చల్లడం భాదాకరం
టీటీడీ ఖండన

తిరుమల 6 జూన్ 2022: శ్రీవాణి ట్రస్ట్ గురించి కొంతమంది వ్యక్తులు అవాస్తవ ప్రచారం చేస్తూ భక్తులను గందరగోళానికి గురిచేయడాన్ని టీటీడీ తీవ్రంగా ఖండిస్తోంది. రాజకీయ, వ్యక్తిగత ప్రచారాలు ఆశించి హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీ మీద అవాకులు, చవాకులు పేలడం రివాజుగా మారింది. సనాతన హిందూ ధర్మాన్ని మారుమూల, అటవీ గ్రామాలకు సైతం విస్తరించే లక్ష్యం తో శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో దళారీ వ్యవస్థ సైతం పూర్తిగా కనుమరుగైంది. టికెట్ ధర పెట్టుకోగలిగే ఆర్థిక స్థోమత ఉన్న వారు ఎవరి సిఫారసు కోరకుండా, దళారీల బారిన పడి మోసపోకుండా శ్రీవాణి టికెట్ కొని నేరుగా స్వామివారి దర్శనం చేసుకోగలుగుతున్నారు.

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన ప్రతి పైసా మారుమూల గ్రామాల్లో హిందూ ఆలయాలు, పురాతన ఆలయాల మరమ్మత్తులు, అభివృద్ధి, పునర్ నిర్మాణం కోసమే ఉపయోగిస్తున్నాము. ఈ నిధుల ద్వారా గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో 501 ఆలయాలు నిర్మించాము. రాబోయే రెండేళ్ళలో 1030 ఆలయాల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో కొన్ని వివిధ దశల నిర్మాణంలో ఉన్నాయి.

వాస్తవాలు ఇలా ఉంటే కొందరు శ్రీవాణి ట్రస్ట్ మీద అవాస్తవాలు చెబుతూ, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరం. ఇలాంటి వ్యక్తుల మీద, వారి అవాస్తవ ఆరోపణలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ హెచ్చరిస్తోంది.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది