LIQUOR BAN IN A PHASED MANNER IN TIRUPATI ALSO-TTD CHAIRMAN_ టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

BY SANKRANTI NEXT TOTAL PLASTIC BAN IN TIRUMALA

Tirumala, 23 Oct. 19: As both Tirumala and Tirupati are the core twin pilgrim centres, the liquor ban will be implemented in a phased manner in Tirupati City also on the lines of Tirumala which is a liquor free zone and the proposal in this regard will be sent for the consent of State Government, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

During press conference held at Annamaiah Bhavan in Tirumala on Wednesday evening, the Chairman shared the important resolutions taken during the board meeting. Briefing them to media he said, the Chief Minister of Andhra Pradesh Sri YS Jagan Mohan Reddy is firm on complete liquor ban in the State. “In Tirumala liquor is banned since several decades. As Tirupati is also happens to be the prime pilgrim city, we have resolved in the board to observe total liquor ban in Tirupati also”, he added. 

Similarly, to protect the environs of Tirumala a total plastic ban will be achieved by Sankranti next, said the TTD Board Chief. 

The TTD Board Chief said that the works of Garuda Varadhi will be continued after redesigning is done for the project.

He said, Sri Venkateswara Institution of Medical Sciences (SVIMS) is considered to be the State-of-Art medical institution not only offering medical services to the poorest of the poor and needy in Chittoor district but also the entire Rayalaseema area. So to better the services, we have resolved to absorb SVIMS into TTD, the Chairman added.

The board has given green signal towards the regularization of 162 forest workers which will be sent to State Government for approval and remaining 200 forest workers will be given Time-scale.

Adding further, the TTD Trust Board Chief said, the board has mulled to construct a Spiritual City in Tirupati which also includes darshan ticket counters, spiritual theater showcasing animated version of mythology to children etc. for the sake of the pilgrims reducing the pressure in Tirumala. 

The Chairman said, the water woes in Tirumala will have a permanent solution when once the Balaji Reservoir becomes reality and TTD board has sent the estimates in this regard to the State Government for further course of action.

The board has also approved the Time Scale Pay for 386 Contract Teachers and Lecturers in TTD Educational Institutions and 241 Kalyana Katta barbers.

The Chairman said that a Committee will be constituted to decide the guidelines on the Hereditary Archakas issue.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

అక్టోబర్ 23, తిరుమల, 2019: టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం బుధ‌వారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. స‌మావేశం అనంత‌రం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ధార్మిక క్షేత్ర‌మైన తిరుమ‌లకు ఎంతో భ‌క్తిభావంతో భ‌క్తులు వ‌స్తున్నార‌ని, ఆధ్యాత్మిక‌భావ‌న మ‌రింత పెంచేలా తిరుమ‌ల త‌ర‌హాలో తిరుప‌తిలోనూ ద‌శ‌ల‌వారీగా మ‌ద్య‌పాన నిషేధం అమ‌లుచేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి.

– ప్ర‌ధాన‌మంత్రి గౌ..శ్రీ‌.న‌రేంద్ర‌మోడి పిలుపుమేర‌కు తిరుమ‌ల‌లో కూడా సంక్రాంతి తర్వాత  ప్లాస్టిక్ వాడ‌కాన్ని పూర్తిగా నిషేధించేందుకు నిర్ణ‌యం. స్వామివారి ల‌డ్డూ ప్ర‌సాదం తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు చేప‌డ‌తాం.

– తిరుప‌తి న‌గ‌రవాసుల‌తోపాటు బ‌య‌ట ప్రాంతాల నుండి వ‌చ్చే భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండేలా గ‌రుడ వార‌ధిని రీడిజైన్ చేసి రీటెండ‌ర్లు పిలిచేందుకు నిర్ణ‌యం. తిరుప‌తి న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు న‌గ‌ర శివార్ల నుండే ఈ వార‌ధి ప్రారంభ‌మ‌య్యేలా డిజైన్‌లో మార్పు చేసేందుకు ఆమోదం.

– నిమ్స్ త‌ర‌హాలో అభివృద్ధి చేసి మ‌రింత మెరుగైన వైద్య‌సేవ‌లందించేందుకు వీలుగా తిరుప‌తిలోని స్విమ్స్ ఆసుప‌త్రిని టిటిడి ఆధీనంలోకి తీసుకునేందుకు ఆమోదం.

– టిటిడి అట‌వీ విభాగంలో ప‌నిచేస్తున్న 162 మంది సిబ్బందిని రెగ్యుల‌ర్ చేయాల‌ని కోరుతూ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు. మిగిలిన 200 మందికి మినిమ‌మ్ టైంస్కేల్ వ‌ర్తింప‌చేస్తూ నిర్ణ‌యం.

– టిటిడి విద్యాసంస్థ‌ల్లో ప‌నిచేస్తున్న 382 మంది కాంట్రాక్టు టీచ‌ర్లు, లెక్చ‌ర‌ర్ల‌కు, క‌ల్యాణ‌క‌ట్ట‌లోని 241 మంది పీస్‌రేట్ క్షుర‌కుల‌కు మినిమ‌మ్ టైంస్కేల్ వ‌ర్తింపు.

– టిటిడి శాశ్వత ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.6,850/- బ్రహ్మోత్సవ బహుమానం అందించేందుకు నిర్ణ‌యం.

– తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద 200 పైచిలుకు ఎక‌రాల విస్తీర్ణంలో శ్రీ‌వారి భ‌క్తిధామం నిర్మించేందుకు నిర్ణ‌యం. ఇక్క‌డ భ‌క్తి ప్ర‌వ‌చ‌నాలు, పిల్ల‌ల్లో భ‌క్తిభావాన్ని పెంచేలా గ్రాఫిక్స్ ప్ర‌ద‌ర్శ‌న‌లు, ధ్యానం, యోగా కేంద్రాలు, శ్రీ‌వారి వైభ‌వాన్ని తెలిపేలా లేజ‌ర్ షో త‌దిత‌రాలు ఏర్పాటు.

– తిరుమ‌ల‌కు నీటి స‌మ‌స్య‌ను అరిక‌ట్టేందుకు బాలాజి రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణానికి అంచ‌నాలు రూపొందించి ప్ర‌భుత్వానికి పంపాల‌ని నిర్ణ‌యం.

–  టిటిడిలో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన అర్చ‌కుల సేవ‌ల‌ను తిరిగి ఏ విధంగా వినియోగించుకోవాల‌నే విష‌యంపై విధి విధానాలు రూపొందించేందుకు ఒక క‌మిటీ ఏర్పాటు.

– మ‌తమార్పిడుల‌ను అరిక‌ట్టేందుకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాలు నిర్మించేందుకు శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా విరాళాలు సేక‌రించేందుకు నిర్ణ‌యం.

ఈ మీడియా స‌మావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌,  తుడ ఛైర్మ‌న్ మ‌రియు ఎక్స్ అఫిషియో స‌భ్యుడు డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, టిటిడి అదనపు ఈవో  శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌  త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.