HINDU DHARMA PRACHARA PARISHAD COMMITTEE MEETING HELD _ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌నిర్వాహ‌క క‌మిటీ స‌మావేశంలో ముఖ్య నిర్ణ‌యాలు

Tirumala, 23 Oct. 19: The Hindu Dharma Prachara Parishad Executive Committee meeting headed by TTD Trust Board Chief Sri YV Subba Reddy held a meeting on various issued related to the wing at Annamaiah Bhavan on Wednesday evening. 

Some important decisions taken during the meeting:

Felicitation to Folk Group Leaders every year.

Enhancement of daily payments to a group of 15 who render Nagara Sankeertana and Akhanda Harinama Sankeertana at Tirumala from 1500 to 3000(Per person will be paid Rs.200 instead of Rs.100)

The To and Fro bus fares to the Bhajan parties will be paid even the hamlets are void of any bus facility based on the per kilometre tariff

Agreed to pay Rs.200 per person, hailing from SC, ST, BC colonies who undergo training in Archakatva at SVETA in Tirupati

To provide financial aid to the Brahmana Boys Traditional and Jyothisha school at Karvetinagaram

To provide Bhajana equipment to 100 temples out of 500 constructed by TTD and AP Endowments in remote areas on a trial basis. A team of experts will visit the temples to observe the functioning following which the facility will be provided to other temples also

TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, JEO Sri P Basant Kumar, Trust Board members Sri C Bhaskar Reddy (Ex-officio) Sri M Ramulu, Sri Siva Kumar, Co-opted members Sri Penchalaiah, Sri Venkata Subbaiah, Sri Narayana Raju, HDPP Secretary Prof.Rajagopalan were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

 

 

 

హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌నిర్వాహ‌క క‌మిటీ స‌మావేశంలో ముఖ్య నిర్ణ‌యాలు

అక్టోబర్ 23, తిరుమల, 2019: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌నిర్వాహ‌క క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఇందులో తీసుకున్న ముఖ్య నిర్ణ‌యాలు ఇలా ఉన్నాయి.

– కార్వేటిన‌గ‌రంలో కంచి కామ‌కోటి పీఠం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న బ్రాహ్మ‌ణ బాల‌ల సంప్ర‌దాయ జ్యోతిష పాఠ‌శాల‌కు ఆర్థిక‌సాయం అందించేందుకు నిర్ణ‌యం.

– రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా నిర్మించిన 500 ఆల‌యాల్లో మొద‌టివిడ‌త‌గా 100 ఆల‌యాల‌కు భ‌జ‌న సామగ్రిని అందించేందుకు నిర్ణ‌యం. వీటి వినియోగాన్ని ప‌రిశీలించిన అనంత‌రం మిగిలిన ఆల‌యాల‌కు భ‌జ‌న సామ‌గ్రిని అందించేందుకు ఆమోదం.

– తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో నిర్వ‌హిస్తున్న అర్చ‌క శిక్ష‌ణ‌కు హాజ‌ర‌వుతున్న ఎస్‌సి, ఎస్‌టి, మ‌త్స్య‌కార అభ్య‌ర్థుల‌కు శిక్ష‌ణ కాలంలో ఒక రోజుకు రూ.200/- చొప్పున భృతి చెల్లించేందుకు ఆమోదం.

–  ప్ర‌తి సంవ‌త్స‌రం జాన‌ప‌ద క‌ళాకారుల బృందాల గురువుల‌ను స‌న్మానించాల‌ని నిర్ణ‌యం.

– తిరుమ‌ల‌లో న‌గ‌ర సంకీర్త‌న‌, అఖండ హ‌రినామ సంకీర్త‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొనే క‌ళాకారుల‌కు ఒక రోజుకు రూ.100/- బ‌దులుగా రూ.200/- చెల్లించేందుకు ఆమోదం.

– భ‌జ‌న బృందాల క‌ళాకారుల‌కు రాను పోను బ‌స్ చార్జీలు చెల్లించేందుకు నిర్ణ‌యం. ఒక కిలోమీట‌ర్‌కు 62 పైస‌లు చొప్పున చెల్లించేందుకు ఆమోదం.

 ఈ స‌మావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, బోర్డు స‌భ్యులు శ్రీ మోరంశెట్టి రాములు, శ్రీ శివ‌కుమార్‌, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, కో-ఆప్టెడ్ స‌భ్యులు శ్రీ వి.వెంక‌ట‌సుబ్బ‌య్య‌, శ్రీ పెంచ‌ల‌య్య‌, శ్రీ నారాయ‌ణ‌రాజు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.