KAVACHA SAMARPANA HELD _ క‌వచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్ఠాభిషేకం

TIRUPATI, 02 JULY 2023: On the last day of Jyestabhishekam in Sri Govindaraja Swamy temple on Sunday, Kavacha Samarpana was observed.

This ritual marked the conclusion of the annual event.

Both the senior and junior pontiffs of Tirumala, DyEO Smt Shanti and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

క‌వచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్ఠాభిషేకం
          
తిరుపతి, 2023, జూలై 02: శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం క‌వ‌చాల‌ను ఊరేగింపు నిర్వ‌హించారు.

ఆ త‌రువాత శతకలశ స్నపనం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌ను కల్యాణమండపంలోకి వేంచేపు చేసి స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
క‌వ‌చ ప్ర‌తిష్ట‌, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆస్థానం నిర్వ‌హించిన తరువాత స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. సాయంత్రం ఉభయనాంచారులతో కలసి స్వామివారు ఆలయ ప్రధాన వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ప్రధానార్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, వైఖానస ఆగమసలహాదారు
శ్రీ మోహనరంగాచార్యులు, ఏఈవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు, శ్రీ నారాయణ, శ్రీ మోహన్ రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రాధాకృష్ణ, శ్రీ ధనంజయులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.