MAHA SHIVARATRI FESTIVITIES AT SRI KAPILESWARA TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభ‌వంగా మహాశివరాత్రి వేడుకలు

Tirupati, 01 March 2022: On the auspicious occasion of Maha Shivratri, grand festivities were observed at Sri Kapileswara temple on Tuesday.

TTD has made elaborate arrangements of queue lines, drinking water and green shades besides implementing Covid norms and provided hassle freer Darshan of Sri Kapileswara Swami and His consort Sri Kamakshi Ammavaru to devotees on the festival day.

As part of the ongoing annual Brahmotsavams the Bhogi Teru Asthanam was observed inside the temple in Ekantam in view of Covid-19 guidelines.

Thereafter Archakas performed the celestial event of Snapana Tirumanjanam to the deities.

Other important events like the Nandi vahanam, the holy Lingodbhavakala Abhisekam are lined up in the later half of the day.

SPECIAL SERVICES OF SRIVARI SEVAKULU

The team of Srivari Sevakulu rendered special services to devotees who thronged the temple on the auspicious festival day.

SIVA PARVATI KALYANAM ON MARCH 2

As part of Brahmotsavam events, a day after Maha Shivaratri, the epic fete of Siva Parvati Kalyana Mahotsavam is being organised on March 2.

Temple DyEO Sri Subramaniam, AEO Sri Satre Nayak, Superintendent Sri Bhupathi, temple inspectors Sri Reddy Sekhar, Sri Srinivasa Nayak and temple archakas, staffs were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభ‌వంగా మహాశివరాత్రి వేడుకలు
          
తిరుపతి, 2022 మార్చి 01: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి  వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనల మేరకు భక్తులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఏకాంతంగా భోగితేరు ఆస్థానం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం భోగితేరు ఆస్థానం జరిగింది. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో  ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఆత్మ రథికుడు. శరీరమే రథం. బుద్ధి సారథి. మనస్సు పగ్గం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది.

వేడుకగా స్నపనతిరుమంజనం

ఆ తరువాత అర్చకులు స్నపన తిరుమంజనం ఏకాంతంగా నిర్వహించారు. శ్రీస్కోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామి, అమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు.

రాత్రి 7 గంటలకు ఏకాంతంగా నంది వాహ‌నం ఆస్థానం నిర్వ‌హిస్తారు. మార్చి 2వ తేదీ బుధవారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు.

శ్రీవారి సేవకుల విశేష సేవలు

ఆలయానికి విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకులు విశేష సేవలందించారు. క్యూలైన్ల క్రమబద్ధీకరణతో పాటు భక్తులు భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా సూచనలు చేశారు. భక్తులందరికీ శానిటైజర్ స్ప్రే చేశారు. 

మార్చి 2న శివపార్వతుల కల్యాణం :

శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన బుధవారం సాయంత్రం శివపార్వతుల కల్యాణ మహోత్సవం ఏకాంతంగా జరుగనుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఎఈఓ శ్రీ సత్రేనాయక్, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.