MAHAANYASA PURVAKA EKADASA RUDRABHISHEKAM HELD AT DHYANARAMAM _ ధ్యానారామంలో శాస్త్రోక్తంగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
Tirupati, 01 March 2022: As part of Maha Sivaratri festivities, TTD has organised the sacred fete of Mahanyasa Purvaka Ekadasa Rudrabhishekam at Dhyanaramam in the SV Vedic University campus on Tuesday morning.
In this connection, the Archakas performed Panchamruta Abhishekam and Rudrbhishekam and the same was live telecasted by the SVBC.
SV Vedic University Vice-chancellor Acharya Sannidhanam Sudarshana
Sharma, Acharyas, Vedic pundits of the University also were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ధ్యానారామంలో శాస్త్రోక్తంగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
తిరుపతి, 2022 మార్చి 01: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆవరణలో గల ధ్యానారామంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా భారీ శివలింగానికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఈ సందర్భంగా శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పదకొండు ద్రవ్యాలతో పదకొండు సార్లు రుద్రం, నమక చమక మంత్రసహితంగా అభిషేకించారు. మహాశివరాత్రి రోజున నిర్వహించే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, వేద వర్సిటీ ఆచార్యులు, వేదపండితులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.