MALAYAPPA AS SARASWATI BLESSES DEVOTEES ON HAMSA VAHANAM _ హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

TIRUMALA, 19 SEPTEMBER 2023: Sri Malayappa decked in Saraswati Alankaram blessed His devotees on Tuesday evening as a part of the ongoing annual Brahmotsavams on the second day.

TTD Chairman Sri B Karunakara Reddy, EO Sri AV Dharma Reddy, a few board members, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam and others were also present.

UNIQUE ARTFORMS DISPLAYED

A series of variety of Artforms by artistes from the state of Tamil Nadu were performed before Hamsa Vahanam which allured devotees in galleries.

The Artforms included Pokal Kudarai, Karakattam, Dindikal Drums,  Shankhanadham Panchavaidyam, Peacock Dance, Kaaliyattam, Kerala Dance, Sakuntalam, Kolatam besides Brahmanda Nayakuni Brahmotsavam by the students of SV College of Music and Dance choreographed by Dr Harnath.

The unique artforms are exclusively selected under the personal supervision of JEO (H&E) Smt Sada Bhargavi. 

All Projects Program Officer Sri Rajagopal, Special Officer Dasa Sahitya Project Dr Anandathirthacharyulu were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 19: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ‌ రోజు మంగ‌ళ‌వారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు.

హంస వాహనం – బ్రహ్మపద ప్రాప్తి

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

హంసవాహన సేవలో కళావైభవం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి హంస వాహన సేవలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి.

ఇందులో శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో నర్తన గణపతి కళారూపకం ఆకట్టుకుంది.

అదేవిధంగా భృగుమహర్షి, శ్రీవారి రూపాలంకృతులతో తమిళనాడు బృందం భరతనాట్యం, శ్రీవారే దేవాది దేవుడుగా భావిస్తూ ఆడుతూ పాడుతూ చేసే తమిళనాడు పెరుమాళ్ నృత్యం, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ ప్రాంతాలలో విశేష ప్రాచుర్యంలో ఉన్న కాళీయట్టంతో కాళీయమర్ధనం, మోహినీ నృత్యం అలరించాయి. వీటితో పాటు తమిళనాడుకు చెందిన నెమలి నృత్యం, పాండిచ్చేరికి చెందిన కట్టెలపై నడుస్తూ, వృషభ పులివేషాలతో కూడిన కరకట్టం, కుత్రాల కురవంజి అనే నృత్యాలు, గోపికా వేషధారణలతో కూడిన మణిపూర్ నృత్యం, తమిళనాడు నుండి వచ్చిన కోలాట నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుండి దాదాపు 300 మంది కళాకారులు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

ఈ వాహనసేవలోని కళా ప్రదర్శనలను టీటీడీ జెఈఓ శ్రీమతి సదా భార్గవి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులతో కలిసి స్వయంగా పర్యవేక్షించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.