DRY FRUIT GARLANDS STEALS THE SHOW ON THE FIRST DAY OF SNAPANAM_ శ్రీ‌వారి కైంక‌ర్యంలో త‌రించిన సుగంధద్రవ్యాలు, ఎండుఫ‌లాలు- స్న‌ప‌నంలో ఆక‌ర్ష‌ణీయంగా చందనం, పిస్తా- ఏలకుల మాల‌లు, కిరీటాలు

TIRUMALA, 19 SEPTEMBER 2023: As a part of the ongoing annual Brahmotsavams in Tirumala, the sacred Snapana Tirumanjanam was observed on Tuesday afternoon between 1pm and 3pm in a grand manner in the Ranganayakula Mandapam.

Usually during the annual fete, Snapana Tirumanjanam is performed to the Utsava deities as a “Soothing Ritual” from the hectic schedule of Vahana Sevas and other religious activities.

The entire Mandapam was tastefully decked with various fruits especially with a canopy of oranges atop and exotic flowers hanging all over. While rendering Snapanam to the Utsava deities, after the completion of each phase of Abhishekam with one sacred material, the garlands and crowns were changed to deties for nine times. The deities were decked with the garlands made of Cardamom, Kuskus, Pistachios, Sandal, black grapes, Yellow Horns(Pasupu Kommulu), coral type rose petals, roses and Tulasi.

All these decorations were prepared by 250 florists from Tamilnadu and Karnataka besides 150 Garden staff of TTD with the donations made by Tamilnadu devotees from Tiruppur and Salem. 

The entire event was a cynosure to the devotees who witnessed live as well to the millions who watched on the SVBC. The entire premises was filled with aromatic fumes amidst the rhythmic chanting of Vedic hymns by the Veda Pundits. 

TTD EO Sri AV Dharma Reddy, JEO for Health and Education Smt Sada Bhargavi, DyEO Temple Sri Lokanatham, Garden Deputy Director Sri Srinivasulu and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ‌వారి కైంక‌ర్యంలో త‌రించిన సుగంధద్రవ్యాలు, ఎండుఫ‌లాలు

– స్న‌ప‌నంలో ఆక‌ర్ష‌ణీయంగా చందనం, పిస్తా- ఏలకుల మాల‌లు, కిరీటాలు

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 19: శ్రీ‌వారి స్న‌ప‌న తిరుమంజ‌నంలో శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని స్పృశించే అవ‌కాశం చందనం, పిస్తా – ఏల‌కులు మాల‌ల‌కు ద‌క్కింది. మంగ‌ళ‌వారం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్న‌ప‌న తిరుమంజ‌నం శాస్త్రోక్తంగా జరిగింది.

శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనుల‌ను చేసి వివిధ ర‌కాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు, తామ‌ర‌ల‌తో వేదిక‌ను సుంద‌రంగా తీర్చిదిద్దారు.

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఏలకులు, వట్టి వేరు, పిస్తా, చంద‌నం, న‌ల్ల ద్రాక్ష, ప‌సుపు కొమ్ములు, రోజ్ పెట‌ల్స్‌. తులసి దండలు స్వామి అమ్మవార్లకు అలంకరించారు.

టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు చేశారు. ఒక్క టన్ను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, పండ్లు, లతలతో వేదికను శోభాయమానంగా అలంకరించడమే కాకుండా శ్రీ మలయప్ప స్వామివారికి రూపొందించిన పూలమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరుపూర్, సేలం దాతలు ఈ మాలలను విరాళంగా అందించారు.

టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.