MALAYAPPA RIDES HANUMAN _ హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప విహారం

TIRUMALA, 04 FEBRUARY 2025: In the vahanam series, Sri Malayappa Swamy graced devotees on His noble Hanumanta Vahanam, the fourth and also the last one in the series of first half vahanams on Tuesday on the auspicious day of Radhasapthami.

This celestial vahanam took place between 1pm and 2pm along the four mada streets. Sri Malayappa atop the Hanumanta Vahanam moved gently along the temple streets. All the galleries are full to their capacities and every inch is occupied with devotees. 

TTD EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary and other officials were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప విహారం

తిరుమల, 2025 ఫిబ్రవరి 04: తిరుమలలో మంగళవారంనాడు రథసప్తమి ఉత్సవం సందర్భంగా నాలుగో వాహనమైన హనుమంత వాహనసేవ వైభవంగా జరిగింది.

హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి (మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు) :

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.