NAVAGRAHA HOMAM _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా న‌వ‌గ్ర‌హ హోమం

TIRUPATI, 09 NOVEMBER 2024: As part of the month long annual Homa Mahotsavams in Sri Kapileswara Swamy temple, Navagraha Homam was observed on Saturday in Tirupati.

Temple DyEO Sri Devendra Babu and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా న‌వ‌గ్ర‌హ హోమం

తిరుపతి, 2024 న‌వంబ‌రు 09: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం న‌వ‌గ్ర‌హ హోమం శాస్త్రోక్తంగా జ‌రిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మ‌వారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టారు.

హోమ మ‌హోత్స‌వాల్లో భాగంగా న‌వంబ‌రు 10 నుండి 18వ తేదీ వ‌ర‌కు శ్రీ కామాక్షి అమ్మ‌వారి హోమం(చండీ యాగం) జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.