SNAPANA TIRUMANJANAM PERFORMED _ వైభవంగా శ్రీ భూ సమేత మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం
TIRUMALA, 09 NOVEMBER 2024: The sacred bath, Snapana Tirumanjanam to the utsava deities of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi was observed in Tirumala temple on Saturday morning.
In connection with the Pushpayagam, snapanam was performed to the deities between 9am and 11am. The vedic pundits chanted Sri, Bhu, Purusha, Neela and Narayana Suktams on the occasion and anointed the processional deities with aromatic ingredients besides milk, curd, turmeric, sandal paste.
One of the temple chief priests Sri Govindaraja Deekshitulu performed the holy ritual in the presence of Tirumala Jeeyar Swamijis. Later the ritual culminated by offering Nakshatra Harati, Kumbha Harati and Special Harati.
Additional EO Sri Ch Venkaiah Chowdary, and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీ భూ సమేత మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం
తిరుపతి, 2024 నవంబరు 09: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
పుష్పయాగం సందర్భంగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు శ్రీ, భూ, పురుష, నీల, నారాయణ సూక్తాలను మంత్రోచ్ఛారణలతో, ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, పసుపు, చందనం లతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
తిరుమల జీయర్ స్వామీజీల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గోవిందరాజ దీక్షితులు పవిత్రోత్సవాలు నిర్వహించారు. అనంతరం నక్షత్ర హారతి, కుంభ హారతి, ప్రత్యేక హారతి సమర్పించి ఆచారం ముగిసింది.
అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.