NO LATHI CHARGE ON DEVOTEES, SAYS TTD CHAIRMAN _ లాఠీచార్జి జరగలేదు – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

Tirumala, 24 Dec. 20: TTD chairman Sri YV Subba Reddy on Thursday categorically said that there was no lathi-charge anywhere on devotees who came for Srivari Darshan at Tirumala.

Replying to a question by a reporter at Tirumala on Thursday, TTD chairman refuted the allegations made by the leader of opposition Sri N Chandrababu Naidu and said that TTD had made elaborate arrangements to provide comfortable Vaikunta Dwara Darshan for ten days starting from Vaikunta Ekadasi on December 25 till January 3 to common devotees this year.

Declining to be drawn into a political debate at Tirumala shrine the TTD Chairman said TTD was mulling over the prospects of developing the Annamaiah Margam  (located on the second ghat road) further.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

లాఠీచార్జి  జరగలేదు-  టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల, 2020 డిసెంబ‌రు 24: తిరుమలలో స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులపై ఎక్కడా లాఠీచార్జి జరగలేదని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. భక్తులపై లాఠీచార్జి జరిగినట్లు ప్రతిపక్ష నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు చైర్మన్ ఈ సమాధానం ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి దర్శనం ఏర్పాట్లలో టీటీడీ యంత్రాంగం సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు.  తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం తనకు ఇష్టం లేదని విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేసే అంశం పరిశీలిస్తున్నామని అన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది.