SRIVARI SEVAKS SHOULD BECOME TORCH BEARERS OF HINDU SANATANA DHARMA-TTD CHAIRMAN _ కొత్త సంవత్సరంలో కళ్యాణమస్తు

SERVICE TO HUMANITY IS SERVICE TO DIVINITY-EO

Tirumala, 24 Dec. 20: Srivari Sevakulu who have been rendering impeccable services to fellow pilgrims from the past two decades, should also play an active role in Hindu Sanatana Dharma activities taken up by TTD in different parts of the country, said TTD Chairman Sri YV Subba Reddy.

Addressing the volunteers at Asthana Mandapam on Thursday, he said, the Srivari Sevakulu should render whole hearted services to the pilgrims who will be visiting Tirumala for Vaikuntha Dwara Darshanam starting from December 25 till January 3. He said, for the first time, TTD has taken a historical decision to open up the doors for Vaikuntha Darshanam for ten days to provide Dwara Darshanam to more number of pilgrims. “Among all festivities that are being observed in Tirumala, we have annual Brahmotsavams and Vaikuntha Dwara Darshanam are the two most important festivals. Like annual brahmotsavams, from this year onwards, Vaikuntha Dwara Darshanam will also be opened up for pilgrims for ten days instead of earlier practice of two days”, he added.

The Chairman also said, under the instructions of Honourable CM of Andhra Pradesh Sri YS Jaganmohan Reddy, TTD has taken up various Dharmic activities including Gudiko Gomata-by presenting a cow and calf to every temple, construction of 500 temples in SC, ST, BC, fishermen colonies and agency areas in two Telugu states and also contemplating on conducting free mass marriages to the poor couple soon in the name “Kalyanamastu”. He sought the active involvement of Srivari Sevakulu in their respective villages and towns in the Dharmic activities taken up by TTD. Srivari Sevakulu have been offering outstanding services to pilgrims all these years and hope to see more from you in future. The every day orientation and Satsang programme by Sri Satya Sai Seva Organisation will help you to extract more qualitative services from volunteers”, he observed.

Speaking on the occasion, TTD EO Dr KS Jawahar Reddy, said, with the noble concept, “Manava Seve Madhava Seva-Service to Humanity is Service to Divinity”, TTD has commenced Srivari Seva in the year 2000 with just 200 volunteers, Srivari Seva has now emerged into an enormous seva organisation and lending support to TTD in rendering free services to pilgrims. “So far nearly 12lakh volunteers have rendered Srivari Seva, hailing from 19 states across the country in the last two decades. The Srivari Seva was also started in Tirupati in 2014 to offer services to pilgrims in local temples. As you are all invited to serve pilgrims who will be visiting for Vaikuntha Dwara Darshan, I request you all to follow the Covid guidelines first like wearing masks, using sanitisers and maintaining social distance of two meters in between and then guide the pilgrims. We have also placed masks at all the entry points in VQC, for the sake of pilgrims, in the case if any one forgets to wear mask”, he maintained.

 

Earlier, SV Higher Vedic Studies Special Officer, Dr A Vibhishana Sharma offered religious discourse on the importance of Vaikuntha Ekadasi and Vaikuntha Dwara Darshanam followed by melodious bhajans. Nearly 2000 volunteers hailing from all southern states and Maharastra took part in this programme.

PRO Dr T Ravi, VGO Sri Bal Reddy, APRO Ms P Neelima, AEO Srivari Seva Sri Ramakanth Rao, AE Sri Varaprasad and other office staffs of Srivari Seva participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

కొత్త సంవత్సరంలో కళ్యాణమస్తు

–   శ్రీవారి సేవకులు అన్ని ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి

–  టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి పిలుపు

– 20  ఏళ్ళలో 12 లక్షల మంది భక్తుల శ్రీవారి సేవ

తిరుమల, 2020 డిసెంబ‌రు 24: ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో  కొత్త సంవత్సరం లో కళ్యాణమస్తు కార్యక్రమం ప్రారంభిస్తున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. భక్తులకు సేవ చేస్తున్న శ్రీవారి సేవకులు టీటీడీ నిర్వహించే అన్ని ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

తిరుమల ఆస్థాన మండపం లో గురువారం నిర్వహించిన శ్రీవారి సేవకుల సమావేశంలో చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తి స్పూర్తి గా 2000 నవంబరు లో కంచి పీఠాధిపతి స్వర్గీయ శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా శ్రీవారి సేవ ప్రారంభించారన్నారు.200 మందితో ప్రారంభమైన శ్రీ వారి సేవలో 20 ఏళ్లలో సేవ అందించిన 12 లక్షల మంది సేవకులకు ఆయన అభినందనలు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో కూడా సేవ కోసం వచ్చిన సేవకులు తిరుమల సహా అన్ని స్థానిక ఆలయాల్లో కూడా మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటూ భక్తులు కూడా వీటిని పాటించేలా చేయాలని కోరారు. సి ఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో టీటీడీ దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున హిందూ ధర్మ ప్రచారం చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, బిసి కాలనీల్లో 500 ఆలయాలు నిర్మించబోతున్నామని ఆయన తెలిపారు. గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా గోవులను పోషించుకోగలిగే  ఆలయాలకు గోవులను ఇవ్వనున్నట్లు చెప్పారు. పేద ప్రజలు పిల్లల పెళ్లిళ్ల కోసం అప్పుల పాలు కాకుండా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పెళ్ళిళ్ళు చేయించడానికి కొత్త సంవత్సరం లో కళ్యాణ మస్తు కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెళ్లి చేసుకునే జంటకు బట్టలు, మంగళ సూత్రం ఇవ్వడంతో పాటు ఇరు వైపుల వారికి భోజనం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

బ్రహ్మోత్సవాల తరహాలో ఈ సారి నుంచి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కూడా 10 రోజులు నిర్వహిస్తున్నామని చైర్మన్ చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు సేవ చేయడం మహాభాగ్యమని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీ సత్యసాయి సేవా సమితి వారు శ్రీ వారి సేవకులకు శిక్షణ ఇస్తుండటం ప్రశంస నీయమన్నారు.

టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, భక్తుల కోరిక, పీఠాధి, మఠాధిపతుల సలహా మేరకు 10రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అమలు చేస్తూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామన్నారు. శ్రీ వారి సేవకులు కోవిడ్ 19 నిబంధనలు జాగ్రత్తలు పాటిస్తూ భక్తులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. మాస్కు లు ధరించని వారికి వివరించి చెప్పాలని, క్యూ లైన్లు,ఆలయం తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, చేతులు శుభ్రం చేసుకునేలా చేయాలని కోరారు.
 
ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి శ్రీ విభీషణ శర్మ, ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ రవి తో పాటు ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది.