PADMA MANDAPAM IS A CYNOSURE DURING SNAPANAM _ జాజి ప‌త్రి, పిస్తా, క‌ర్జూరం, ఎండు ద్రాక్ష‌ మాల‌ల‌తో వేడుక‌గా శ్రీ‌వారికి స్న‌ప‌నం

TIRUMALA, 09 OCTOBER 2021: On the third day afternoon as part of ongoing annual brahmotsvams, Snapana Tirumanjanam was performed to Sridevi Bhudevi Sameta Sri Malayappa Swamy at Ranganayakula Mandapam in Tirumala temple.

 

Though Snapana Tirumanjanam is performed on different occasions, the one during annual brahmotsavams assumes importance since the processional deities are decked with varieties of garlands made of fruits, dry fruits, cereals, spices apart from various flowers every year. 

 

Especially the Mandapam stands out with excellent theme work made of out of flowers and fruits.

 

This year, the mandapam where snapanam was performed is designed in the form of a lotus with scores of lotuses hanging from the top. Adding extra glamour to the entire Ranganayakula Mandapam, the decoration with bright coloured oranges and green leaves enhanced the beauty.

 

While Snapanam is being performed to deities, seven times garlands are changed during this two-hour long event before concluding with Tulasi garlands. To start with, the garlands made of Nutmegs, pistachios, dates, dry grapes, varieties of rose petals, Panneer leaves and blue pavitras (beads made of silk threads) were decked to the deities before concluding the sacred, colourful fete with Tulasi garlands amidst chanting of Vedic hymns by Veda parayanamdars.

 

Sri Vasudeva Bhattacharya acted as Kankana Bhattar for the first day of Snapana Tirumanjanam. 

 

“The florists worked three days and nights to prepare the Padma Mandapam and a Chennai-based devotee, Sri Trilok Chander has come forward to bear the cost of decoration on donation”, said TTD Garden Deputy Director Sri Srinivasulu.

 

HH Tirumala Pedda Jeeyar Swamy, HH Tirumala Chinna Jeeyar Swamy, TTD EO Dr KS Jawahar Reddy and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

జాజి ప‌త్రి, పిస్తా, క‌ర్జూరం, ఎండు ద్రాక్ష‌ మాల‌ల‌తో వేడుక‌గా శ్రీ‌వారికి స్న‌ప‌నం

ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ప‌ద్మ‌ మండ‌పం

తిరుమల, 2021 అక్టోబ‌రు 09: బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా శ‌నివారం శ్రీ‌వారి ఆల‌యంలో జాజి ప‌త్రి, పిస్తా, క‌ర్జూరం – ప‌న్నీరు ఆకు, ఎండు ద్రాక్ష, రోజా పువ్వు రేకుల‌తో ప్ర‌త్యేకంగా రూపొందించిన మాల‌లు, కిరీటాల‌తో స్న‌ప‌న తిరుమంజ‌నం వేడుక‌గా జ‌రిగింది. రంగ‌నాయ‌కుల మండ‌పంలో ప్ర‌త్యేక వేదిక‌పై ఆశీనులైన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి వేద మంత్రాల న‌డుమ కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ వాసుదేవ భ‌ట్టాచార్యులు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

దాదాపు రెండు గంట‌ల పాటు జ‌రిగిన స్న‌ప‌న తిరుమంజ‌నంలో వివిధ‌ ర‌కాల మాల‌ల‌తో శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు భ‌క్తుల‌కు క‌నువిందు చేశారు. ప‌లు ర‌కాల సుగంధ ద్ర‌వ్యాల‌తో అభిషేకం చేస్తుండ‌గా, ప్ర‌త్యేక మాల‌ల‌ను అలంక‌రించారు. జాజి ప‌త్రి, పిస్తా, క‌ర్జూరం – ప‌న్నీరు ఆకు, ఎండు ద్రాక్ష, రోజా పువ్వు రేకుల‌తో, బ్లూక‌ల‌ర్ ప‌విత్ర మాల‌లు, వ‌ట్టి వేరు, తుల‌సితో త‌యారు చేసిన మాల‌లు అలంక‌రించామ‌ని ఉద్యానవ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు తెలిపారు.

ఆకట్టుకున్న తామ‌ర పువ్వు మండపం

స్నపనతిరుమంజనం నిర్వహించే రంగ నాయ‌కుల మండపంలో తామ‌ర పువ్వు ఆకారంలో వివిధ ర‌కాల సాంప్ర‌దాయ పుష్పాలు, క‌ట్ ఫ్ల‌వ‌ర్స్‌, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలు, ఆస్ట్రేలియా బ‌త్తాయి, ద్రాక్ష గుత్తుల‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. క‌మ‌నీయంగా సాగిన ఈ స్న‌ప‌న తిరుమంజ‌నాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

చెన్నైకి చెందిన దాత శ్రీ త్రిలోక్ చంద‌ర్ స‌హ‌కారంతో స్వామి, అమ్మ‌వార్ల‌కు ప్ర‌త్యేక మాల‌లు, కిరీటాలు, స్న‌ప‌న మండ‌పం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 20 మంది నైపుణ్యం గ‌ల నిపుణులు మూడు రోజుల పాటు శ్రమించి తామ‌ర పువ్వు ఆకారంలో మండ‌పాన్ని రూపొందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, బోర్డు స‌భ్యురాలు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి రెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.