TTD EO SHARES HIS EXPERIENCE WITH IAS TRAINEES _ టిటిడి ఈవోను కలిసిన ట్రైనీ ఐఏఎస్‌లు

TIRUMALA, 09 OCTOBER 2021:  TTD EO Dr KS Jawahar Reddy shared his professional experiences with the IAS trainees in a meeting held at Annamaiah Bhavan on Saturday.

He recalled his journey as an IAS officer and his memorable experiences having served in different capacities at different places giving some instances.

The EO suggested the IAS trainees to work in tribal and backward areas also apart from developed districts to understand the public issues giving the example of late Sri SR Shankaran, IAS who is known for his impeccable service record. He also advised them to go for field visits and understand the issues of that area where they have been posted so that they can do justice public in a better manner.

He also Congratulated and wished them Good Luck in their future assignments. The IAS trainees also thanked the EO for the valuable advices and tips he has given to them.

Additional EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, liaison officers Sri Damodar, Sri Ramana Prasad were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఈవోను కలిసిన ట్రైనీ ఐఏఎస్‌లు

తిరుమ‌ల‌, 2021 అక్టోబ‌రు 09: శిక్షణలో భాగంగా ట్రైనీ ఐఏఎస్‌ల బృందం టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డితో తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం స‌మావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తన ఐఏఎస్ శిక్షణ కాలంలో నేర్చుకున్న విషయాలు ఇప్ప‌టివ‌ర‌కు త‌న ఉద్యోగ ప్ర‌స్థానంలో ఎలా ఉపయోగపడ్డాయన్న అంశాలను అనుభవాలను ఉదాహరిస్తూ చెప్పారు. ఒక ఐఏఎస్‌ అధికారిగా తన ప్రయాణాన్ని, వివిధ సందర్భాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన తన అనుభవాలను, అభివృద్ధి ప‌నుల‌ను తెలియజేశారు.

ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడానికి అభివృద్ధి చెందిన జిల్లాలు మాత్ర‌మే కాకుండా గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతాలలో కూడా పని చేయాలని ట్రైనీ ఐఏఎస్‌ల‌కు ఈవో సూచించారు. అదేవిధంగా వారంలో 3 లేదా 4 రోజుల పాటు క్షేత్ర స్థాయిలో సందర్శించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోగ‌లిగితే ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌వ‌చ్చ‌న్నారు.

అనంత‌రం టిటిడి అమలుచేస్తున్న ఆధ్యాత్మిక‌, విద్య, వైద్య, సంక్షేమ కార్యక్రమాల గురించి ఈవో ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్‌లకు వివరించారు.

ఈ కార్యక్రమంలో అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ‌మ‌తి స‌దాభార్గ‌వి, డెప్యూటీ ఈవోలు శ్రీ దామోదర్, శ్రీ రమణ ప్రసాద్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.