PADMAVATHI AS MAHA LAKSHMI BLESSES DEVOTEES ON GAJA VAHANAM _ గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అభయం

TIRUPATI, 04 DECEMBER 2021: On the fifth day evening of the ongoing annual Navahnika Karthika Brahmotsavams at Tiruchanoor, Goddess Sri Padmavathi Devi decked in Her splendour as Maha Lakshmi,  blessed the devotees.

Due to Covid restrictions, the vahana seva was held in Ekantam.

The deity was adorned with dazzling ornaments including the huge Lakshmi Kasula Haram specially brought from Tirumala temple on the occasion of Gaja Vahanam.

Both Pedda Jiyar and Chinna Jiyar Swamijis of Tirumala, EO Dr K S Jawahar Reddy, District Collector Sri Harinarayana, JEOs Sri Veerabrahmam, Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, Health Officer Dr Sridevi, DyEO Smt Kasturi, Additional Health Officer Dr Sunil and others were also present.

 The religious staff included Agama Advisor Sri Srinivasacharyulu, Archakas Sri Babu Swamy, Sri Manikantha Swamy and others.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అభయం
 
తిరుపతి, 2021 డిసెంబరు 04: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి విశేషమైన గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారు  దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
 
శ్రీ పద్మావతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది గజ వాహనం. గజపటాన్ని ఆరోహణం చేయడంతోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గజం ఐశ్వర్యసూచకం. అందుకే ”ఆగజాంతగం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. పాలసంద్రంలో ప్రభవించిన సిరులతల్లికి గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతమని చెబుతారు.
 
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, జిల్లా.కలెక్టర్ శ్రీ హరి నారాయణ్, జెఈఓలు శ్రీ వీరబ్రహ్మం, శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి కస్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ మధుసుదన్, ఏవిఎస్వో శ్రీ వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
శ్రీ పద్మావతి అమ్మవారికి రూ.6 లక్షలు విలువైన ఆభరణాలు విరాళం
 
ముంబైకి చెందిన శంకర్ నారాయణ అనే భక్తుడు శనివారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి రూ.6 లక్షల విలువైన  బంగారు ఆభరణాలను విరాళంగా అందించారు. ఈ ఆభరణాలను ఆలయంలో అధికారులకు అందజేశారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.