COMPLETE AC WORKS OF KALYANA MANDAPAM QUICKLY- TTD CHAIRMAN _ కళ్యాణ మండపం ఏ సి పనులు త్వరగా పూర్తి చేయండి
CHAIRMAN INSPECTS RAJAHMUNDRY TTD KALYANA MANDAPAM
Rajahmundry, 04 December 2021: TTD Chairman Sri YV Subba Reddy directed officials on Saturday to complete the AC works of TTD Kalyana Mandapam at Danavayipeta in Rajahmundry along with other development works at the earliest.
After inspecting the development works at the TTD Kalyana Mandapam the Chairman directed the officials to speed up air conditioning of eight rooms in first Kalyana Mandapam, ongoing works to the tune of Rs 24 lakh in Second Kalyana Mandapam and Sri Venkateswara Swamy temple worth Rs 5 lakhs and made valuable suggestions.
Local MLAs Sri Jakkampudi Raju, MP Sri M Bharat, Mayor Smt Sharmila Reddy, Donor for Kalyana Mandapam Sri Anil Kumar Reddy, Deputy EE Sri Anand and Manager Smt Shirisha were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
కళ్యాణ మండపం ఏ సి పనులు త్వరగా పూర్తి చేయండి
– రాజమండ్రి లో టీటీడీ కళ్యాణ మండపాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
రాజమండ్రి 4 డిసెంబరు 2021: రాజమండ్రి దానవాయి పేటలోని టీటీడీ కళ్యాణ మండపం ఏసీ పనులతో పాటు ఇతర నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.
కళ్యాణ మండపంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం ఆయన పరిశీలించారు. కళ్యాణ మండపం లోని 8 గదులను కూడా ఏసీ చేయాలన్నారు. కళ్యాణ మండపం హాల్ విస్తరణకు ఆదేశాలు ఇవ్వాలని స్థానికులు కోరగా, సంబంధిత అధికారులతో మాట్లాడతానని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. రెండవకళ్యాణ మండపంలో రూ 24 లక్షలతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపామని అధికారులు వివరించారు. రూ 5 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
స్థానిక శాసన సభ్యులు శ్రీ జక్కంపూడి రాజ, ఎంపి శ్రీ మార్గాని భరత్, మేయర్ శ్రీమతి షర్మిల రెడ్డి, కళ్యాణమడపం స్థల దాత శ్రీ అనిల్ కుమార్ రెడ్డి, డిప్యూటి ఈ ఈ శ్రీ ఆనందరాం, మేనేజర్ శ్రీమతి శిరీష పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది