PADMAVATHI AS SURYANARAYANAMURTY SHINES ON SURYAPRABHA _ సూర్యప్రభ వాహనంపై శ్రీ సూర్యనారాయణ స్వామి అలంకారంలో శ్రీ పద్మావతి

TIRUPATI, 26 NOVEMBER 2022: On the seventh day morning of the ongoing annual Karthika Brahmotsavams in Tiruchanoor, Sri Padmavathi Devi shine brightly as Suryanarayanamurthy on Suryaprabha Vahanam on Saturday.

The bright sun rays glorified the shine of the mighty Suryaprabha Vahanam when the Goddess was parading all along the four mada streets to bless Her devotees. 

Both the pontiffs of Tirumala, Trust Board member Sri Ashok Kumar, JEO Sri Veerabrahmam, Additional HO Dr Sunil, VGO Sir Manohar, temple DyEO Sri Lokanatham and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సూర్యప్రభ వాహనంపై శ్రీ సూర్యనారాయణ స్వామి అలంకారంలో శ్రీ పద్మావతి

తిరుపతి, 2022 న‌వంబ‌రు 26: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం అమ్మవారు శ్రీ సూర్యనారాయణ స్వామివారి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ శ్రీ రాములు, జేఈవో శ్రీ‌ వీర బ్రహ్మం దంపతులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.