CHITTOOR DRUMS AND CHIDATALA RAMAYANAM STEALS THE SHOW _ సూర్యప్రభ వాహనంలో ఆక‌ట్టుకున్న చిడతల రామాయణం, చిత్తూరు డ్రమ్స్

TIRUPATI, 26 NOVEMBER 2022: As part of the ongoing annual Karthika Brahmotsavams in Tiruchanoor, on the seventh day, the cultural activities in front of Suryaprabha Vahanam stood as an added attraction in the procession all along the Mada streets.

Chidatala Ramayanam, a depiction of epic Ramayana in folklore by the artists from Mehaboobabad of Telangana state was a cynosure while Srirangadu Drums troupe from Chittoor attracted the devotees.

Kanchipuram’s Oliyattam and the performances by 14 other teams including kolatams, bhajans etc. enthralled the devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సూర్యప్రభ వాహనంలో ఆక‌ట్టుకున్న చిడతల రామాయణం, చిత్తూరు డ్రమ్స్

తిరుపతి, 2022 న‌వంబ‌రు 26: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం సూర్యప్రభ వాహన సేవలో చిడతల రామాయణం, చిత్తూరు డ్రమ్స్, ఒలియట్యం క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

టీటీడీ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటుచేశారు.

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ కు చెందిన కళాకారులు సీతారాములు, లక్ష్మణుడు, జనకుడు, కౌసల్య, ఆంజనేయులు, రావణుడు వాలి సుగ్రీవులు విశ్వామిత్రుడు తదితర వేషధారణలు ధరించి చిడతలతో రామాయణ గానం చేశారు . చిత్తూరుకు చెందిన శ్రీరంగడు డ్రమ్స్ బృందం కళాకారుల డ్రమ్స్ వాయిద్యం భక్తులను ఆకట్టుకుంది.

తమిళనాడు రాష్ట్రం కాంచీపురంకు చెందిన కళాకారులు తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లోని సాంప్రదాయ ఒలియట్యం నృత్యం ప్రదర్శించారు.

అదేవిధంగా హైదరాబాద్, విశాఖపట్నం తూర్పుగోదావరి, బొబ్బిలి, తిరుపతికి చెందిన 14 భజన బృందాల కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యం, కోలాటాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.