PAVITHROTSAVAM CONCLUDES IN SRI KRT _ శ్రీ కోదండరామాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

Tirupati, 18 Jul. 20: The three-day-long Festival Of Pavitrotsavam concluded grandly at the TTD local temple of Sri Kodandarama Swamy temple with the Purnahuti on Saturday as Ekantham in view of COVID-19 restrictions.

After morning rituals the utsava idols were given snapana thirumanjanam in the afternoon.

Spl Gr DyEO Smt Parvathi, Chief Priest of Sri KRT Sri Anandkumar Deekshitulu, AEO Sri Durga Raju, Superintendent Sri Ramesh, Temple Inspector Sri Ramesh and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
 
తిరుప‌తి, 18 జూలై 2020: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ఆల‌యంలో ఈ కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహించారు.
 
ఈ సందర్భంగా శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం శాత్తుమొర ఆస్థానం నిర్వహించారు. 
 
సాయంత్రం యాగశాలలో పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
 
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ ఆనంద‌కుమారాచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ర‌మేష్ పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.