PARAYANAM COMPLETES 100 DAYS _ తిరుమలలో పారాయ‌ణానికి 100 రోజులు

Tirumala, 18 July,20: The prestigious Parayanam programme commenced by TTD seeking the wellbeing of entire humanity in Nada Neerajanam platform at Tirumala completed 100 days on Saturday. 

As a part of this program, Yoga Vasishtya Mantra, Dhanwantari Maha Mantra were rendered from April 10 onwards. From June 11 onwards, Sundarakanda Parayanam commenced. 

The Parayanam is being executed with efficacy by Dharmagiri Veda Vignana Peetham Principal Sri KSS Avadhani who recites the Mantras followed by devotees. Every day the programme is live telecasted on Sri Venkateswara Bhakti Channel of TTD and won appreciation from Srivari devotees not only in two Telugu states, in the country but across the world. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో పారాయ‌ణానికి 100 రోజులు
 
ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారానికి  విశ్వవ్యాప్తంగా భ‌క్తుల నుండి విశేష స్పంద‌న‌
 
తిరుమ‌ల‌, 2020 జూలై 18: ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై టిటిడి నిర్వహిస్తున్న పారాయణం ఆధ్యాత్మిక కార్యక్రమం వంద రోజులు పూర్తి చేసుకుంది.  శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్న ఈ కార్య‌క్ర‌మాన్ని తెలుగు రాష్ట్రాల‌తోపాటు దేశ విదేశాల్లోని భ‌క్తులు పెద్ద‌సంఖ్య‌లో అనుస‌రించి త‌మ ఇళ్లలో పారాయ‌ణం చేస్తున్నారు. విశ్వ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల నుండి ఈ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భిస్తోంది.
 
 మొదటగా “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణాన్ని ఏప్రిల్ 10 నుండి జూన్ 10వ తేదీ వ‌ర‌కు 62 రోజుల పాటు నిర్వహించారు. ఆ తరువాత జూన్ 11వ తేదీ నుండి సుంద‌ర‌కాండ పారాయ‌ణం ప్రారంభమైంది. ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌‌కు ఈ పారాయ‌ణం జ‌రుగుతోంది.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.