PAVITRA PRATISHTA PERFORMED ON DAY ONE OF PAVITROTSAVAMS_ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

Tirumala, 21 August 2018: The annual Pavitrotsavams off to a religious start with Pavitra Pratishta on Tuesday morning.

Earlier during the day Snapana Tirumanjanam was performed to processional deities in Kalyanotsava Mandapam.

Pavithrotsavam is derived from the two wordsPavithra (holy) and utsava (festival). This utsava is penitential as well as propitiatory and its main objective is to get rid of the evil that might have been caused due to omissions and commissions in the performance of various rituals throughout the year.That is why this utsava is also referred to as “Dosha Nivaarana,” “Sarva Yajna Phalapradha,” by ancient Hindu Scriptures especially in Jayakhya Samgita.

TTD has cancelled Arjitha sevas in connection with this fete.

TTD EO Sri Anil Kumar Singhal took part in this festival.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆగస్టు 21, తిరుమల, 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేస్తారు.

సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు నిర్వహిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాల కారణంగా అష్టదళపాదపద్మారాధనసేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలు రద్దయ్యాయి.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, పేష్కార్‌ శ్రీ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.