ACTION PLAN FOR ENHANCEMENT OF TTD PUBLICATIONS_ టిటిడి ప్రచురణలను పాఠక హృదయాల్లోకి తీసుకెళ్లాలి : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 21 August 2018: To enhance and better market TTD publications, Tirupati JEO Sri P Bhaskar has instructed the concerned to come out with a specific action plan.

A review meeting with Saleswing, HDPP, distributors and publishers was held in the chambers of Tirupati JEO on Tuesday evening.

The JEO discussed in length on the distribution network, exhibitions for promoting TTD publications, importance of printing number on each publication to have better transparency, discount rates, online book sales, quality of printing, content and design of publications etc.

He also directed the concerned officials to go on in house or outsourcing based on book print. Later issues like, cross binding, shrink wrapping of books have also been discussed.

FACAO Sri Balaji, DyEO Saleswing Sri Hemachandra Reddy, HDPP Secretary Sri Ramana Prasad, expert printers Sri Manohar Naidu, Sri Sunil Nivatia were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టిటిడి ప్రచురణలను పాఠక హృదయాల్లోకి తీసుకెళ్లాలి : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

ఆగస్టు 21, తిరుపతి, 2018: టిటిడి ప్రచురణలను దేశవ్యాప్తంగా ఉన్న పాఠకుల హృదయాల్లోకి తీసుకెళ్లేందుకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ పుస్తక ముద్రణ, పంపిణీ, విక్రయం తదితర అంశాల్లో అనుభవం గల కన్సల్టెంట్‌ను నియమించుకుని, వారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పుస్తకాలు పంపిణీ చేసేందుకు సరైన వ్యవస్థ ఉండాలని, పలు ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు ఏర్పాటుచేయాలని, అవసరమైన మేరకు పుస్తకాలు ముద్రించాలని సూచించారు. అదేవిధంగా, పరిస్థితులకు అనుగుణంగా రాయితీలో మార్పులుండాలని, ఆన్‌లైన్‌లో పుస్తక విక్రయాలు చేపట్టాలని, ముద్రణలో నాణ్యత ఉండాలని, పుస్తకంలో విషయం పరిజ్ఞానం, డిజైన్‌ ఆకట్టుకునేలా ఉండాలని, పుస్తకాల సంఖ్యను బట్టి టిటిడి ముద్రించడమా లేదా ఔట్‌సోర్సింగ్‌కి ఇవ్వడమా అనే విషయాన్ని నిర్ధారించాలని జెఈవో తెలియజేశారు.

ఈ సమావేశంలో టిటిడి ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణప్రసాద్‌, సేల్స్‌ వింగ్‌ డెప్యూటీ ఈవో శ్రీ హేమచంద్రారెడ్డి, పుస్తక ముద్రణ నిపుణులు విజయవాడకు చెందిన శ్రీ మనోహర్‌నాయుడు, వైజాగ్‌కు చెందిన శ్రీ సునీల్‌ నివాటియా తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.